Whatsapp | వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ రాజీనామా
ఉద్యోగులను తొలగిస్తున్న మెటాకు గట్టి ఎదరుదెబ్బ
మెటా కంపెనీకి మరో ఎదురుదెబ్బ తగలింది. వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ ఈరోజు రాజీనామా చేశాడు. వాట్సాప్ ఇండియా మొదటి హెడ్‌గా 2018లో అభిజిత్ బాధ్యతలు చేపట్టాడు. వాట్సాప్‌లో యూపీఐ పేమెంట్ ఫీచర్ తీసుకురావడంలో అతని కృషి ఎంతో ఉంది. వాట్సాప్‌ని దేశంలోని ప్రజలందరికీ చేరువ చేయడంలో అభినవ్ విజయం సాధించాడు. అతను పదవి నుంచి తప్పుకోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. అభిజిత్ వాట్సాప్ ఇండియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఎజెటాప్ అనే పేమెంట్ కంపెనీలో పనిచేశాడు. మెటా కంపెనీ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న వారంలోనే అభిజిత్ రాజీనామా చేశాడు.
‘వాట్సాప్ ఇండియా మొదటి హెడ్‌గా ఎనలేని సేవలు అందించిన అభిజిత్‌కు ధన్యవాదాలు. వాట్సాప్‌లో కొత్త సేవలు ప్రారంభించడానికి, వాట్సాప్ వ్యాపారం పెరగడానికి అతని ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి’ అని వాట్సాప్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపాడు.
ట్విట్టర్ బాటలోనే మెటా కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటివరకూ మెటా 11వేల ఉద్యోగులను తొలగించింది. ఈమధ్యే పబ్లిక్ పాలసీ మెటా ఇండియా డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా పదవి నుంచి తప్పుకున్నాడు. దాంతో, మనదేశంలో వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా ఉన్న శివ్‌నాథ్ తుక్రల్ అన్ని మెటా బ్రాండ్లకు పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

