WhatsApp New Payment Feature: వాట్సప్‌లో సరికొత్త పేమెంట్ ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇప్పటికే పేమెంట్ ఫీచర్‌ను ఇండియన్ యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. తాజాగా పేమెంట్ ఫీచర్లో కొన్ని మార్పులు చేసింది. పేమంట్ ఆప్షన్స్‌లో కొన్ని అప్డేట్స్ను తీసుకొచ్చింది. విజువల్‌గా పేమెంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.

వాట్సప్ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగిస్తున్న ఇండియన్ యూజర్స్‌కు అందరికీ.. ఈ కొత్త పేమెంట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. పేమెంట్ బ్యాక్‌గ్రౌండ్‌ను మరింత ఆకర్షణీయంగా వాట్సప్ తీర్చిదిద్దింది.
వాట్సప్ పేమెంట్స్ కోసం కాంటాక్ట్స్‌తో చేసే చాట్స్ అయినా.. ఇతర పేమెంట్ సమాచారం అయినా సరే.. సరికొత్త థీమ్స్‌తో సెట్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్ ఉన్నా.. పండుగ ఉన్నా.. స్పెషల్ డే ఉన్నా.. ఆ రోజు సరికొత్త థీమ్స్‌ను వాట్సప్ అందులో పొందుపరుస్తుంది. దీంతో.. ఆ అకేషన్‌ను బట్టి థీమ్‌ను సెట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌ను మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
ఇప్పటికే ఇండియాలో డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే.. మార్కెట్‌ను ఏలుతున్నాయి. వాటికి కాంపిటిషన్‌గా వాట్సప్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఇతర వాలెట్స్ పనిచేసినట్టుగానే.. వాట్సప్ పేమెంట్ సిస్టమ్ కూడా యూపీఐ ద్వారా పనిచేస్తుంది.

యూపీఐ అంటే?
యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(Unified Payments Interface). లేదా యూపీఐ మెథడ్ అని అంటారు. దీని ద్వారా రియల్ టైమ్‌లో ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యూపీఐ సిస్టమ్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) డెవలప్ చేసింది. ప్రస్తుతం ఇండియాలో వాట్సప్ పేమెంట్ సిస్టమ్‌ను 227 బ్యాంకులు సపోర్ట్ చేస్తున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

