Vivo Y56 5G | దేశీయ మార్కెట్లోకి వివో వై56 5జీ.. ధర రూ.19,999 ఓన్లీ!
Vivo Y56 5G | భారత్ మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో.. వివో వై56 తెచ్చింది. దీని ధర రూ.19,999గా నిర్ణయించింది.
Vivo Y56 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో.. భారత్ మార్కెట్లోకి వివో వై56 5జీ (Vivo Y56 5G) ఫోన్ తీసుకొచ్చింది. ఈ నెల 15 నుంచే దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ షాప్‌ల్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇక నుంచి వివో అధికారిక వెబ్సైట్లోనూ వై56 5జీ (Vivo Y56 5G) ఫోన్ లిస్ట్ అయింది. అంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ వివో వై56 5జీ (Vivo Y56 5G) ఫోన్ కొనుగోలు చేయొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్వోసీ (MediaTek Dimensity 700 SoC) చిప్సెట్తో 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్నది. 5000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు 50-మెగా పిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. రెండు రంగుల ఆప్షన్స్ – బ్లాక్ ఇంజిన్ (Black Engine), ఆరెంజ్ షిమ్మర్ (Orange Shimmer) కలర్స్‌లో అందుబాటులోకి తెచ్చింది వివో. దీని ధర రూ.19,999గా నిర్ణయించింది.
ఇవీ స్పెసెఫికేషన్స్..
- ఆండ్రాయిడ్ 13-బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 13 వర్షన్ (Android 13-based Funtouch OS 13)తో పని చేస్తుంది.
- డ్యుయల్ సిమ్ (నానో) ఆప్షన్ కలిగి ఉంటుంది.
- 6.58-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1,080×2,408 పిక్సెల్) ఎల్సీడీ స్క్రీన్.
- మీడియా టెక్ డెమైన్సిటీ 700 ఎస్వోసీ చిప్సెట్
- ఆన్‌బోర్డ్ స్టోరేజీ 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.
- డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్లో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్/1.8 అపెర్చర్ అండ్ 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ విత్ ఎఫ్/2.4 అపెర్చర్.
- సెల్ఫీలు, వీడియో రికార్డింగ్‌లకు ఫ్రంట్‌లో 16-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఎఫ్/2.0 అపెర్చర్ కెమెరా.
ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ.
- ఆస్సిలోమీటర్ (accelerometer), అంబియెంట్ లైట్ సెన్సార్ (ambient light sensor), ఈ-కంపాస్ (e-compass), గ్యోరోస్కోప్ (gyroscope), ప్రాక్సిమిటీ సెన్సర్ (proximity sensor).
- బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సర్.
కనెక్టివిటీ ఆప్షన్స్
- వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.
- 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ.. సపోర్ట్స్ 18వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ వయా యూఎస్బీ టైప్-సీ పోర్ట్.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

