న్యూఢిల్లీ : జనవరి తొలివారంలో వివో 23 ప్రోను లాంఛ్ చేసేందుకు వివో సన్నాహాలు చేస్తోంది. వివో 23 ప్రో జనవరి 4న లాంఛ్ అవుతుందని 91మొబైల్స్ నివేదిక వెల్లడించింది. వివో వీ23 సిరీస్‌లో భాగంగా వివో వీ23 ప్రోను వివో లాంఛ్ చేస్తోంది. లీకయిన వివరాల ప్రకారం వివో వీ23 ప్రో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కస్టమర్ల ముందుకు రానుంది. వివో వీ21 స్పెసిఫికేషన్స్‌తోనే వివో వీ23 ప్రో రానుందని చెబుతున్నారు.
ఇక వివో 23 ప్రో ఆక్టా కోర్ డైమెన్సిటీ 800యూ చిప్‌సెట్‌ను కలిగిఉంటుందని, తొలుత వీ23 ప్రో లాంఛ్ కానుండగా ఆపై స్టాండర్డ్ వివో వీ23 రానుందని 91మొబైల్స్ నివేదిక తెలిపింది. వివో 23 ప్రొ ఫన్‌టచ్ ఓఎస్ 11తో ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ 29,200 నుంచి అందుబాటులో ఉంటుందని ఆ రిపోర్ట్స్ అంచనా వేశాయి.