Phantom V Fold 5G | 11న భారత్ మార్కెట్లో టెక్నో ‘ఫాంటం వీ ఫోల్డ్ 5జీ’ ఫోన్ ఆవిష్కరణ.. లాంచింగ్ ఆఫర్ రూ.77,777 ఓన్లీ!
Phantom V Fold 5G | ఛైనా స్మార్ట్ ఫోన్ సంస్థ ’టెక్నో‘ భారత్ మార్కెట్లోకి ఈ నెల 11న ’ఫాంటం వీ ఫోల్డ్ 5జీ‘ ఫోన్ ఆవిష్కరించనున్నది.
Phantom V Fold 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ టెక్నో.. భారత్ మార్కెట్లోకి ‘ఫాంటమ్ వీ ఫోల్డ్ 5జీ’ ఫోన్ ఈ నెల 11న తీసుకురానున్నది. `మేడ్ ఇన్ ఇండియా` కింద భారత్‌లోనే తమ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. టెక్నో తన `ఫాంటం వీ ఫోల్డ్ 5జీ` ఫోన్, డిజైన్, స్పెషిఫికేషన్స్‌ను తన వెబ్సైట్లో వెల్లడించింది. మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్‌తో వస్తున్నది.
హెచ్ఐఓఎస్ (HiOS) ఫోల్డ్ వర్షన్ విత్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఏప్రిల్ 12 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. లాంఛింగ్ ధరగా రూ.77,777లకు కొనుగోలు చేయొచ్చు. అయితే, ఈ లాంఛింగ్ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర ఎంత అన్నది టెక్నో వెల్లడించలేదు.
ఫాంటమ్ వీ ఫోల్డ్ 5జీ స్పెషిఫికేషన్స్..
6.42-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్ డిస్ప్లే
ఫోన్ హ్యాండ్సెట్ మెయిన్ డిస్ప్లే 7.85-అంగుళాలు విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ 2కే + విత్ 2,296×2,000 పిక్సెల్ రిజొల్యూషన్.
256 జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజీ, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభ్యం.
రెండు వేరియంట్లలోనూ 12జీబీ ఎల్పీడీడీఆర్ 5ఎక్స్ రామ్ కూడా ఉంటుంది.
5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
15 నిమిషాల్లో 40 శాతం, 55 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్
50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా విత్ 1/1.3 అంగుళాల సెన్సర్ సైజ్ అండ్ ఎఫ్/1.8 అపెర్చర్.
50-మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్ అండ్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 13-మెగా పిక్సెల్ విత్ 120 డిగ్రీ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్.
32 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా విత్ ఏ పంచ్ హోల్ నాచ్ ఇన్ ది డిస్ప్లే ఆఫ్ ది ఫోల్డబుల్ కవర్.
16-మెగా పిక్సెల్ కెమెరా ఫర్ వీడియో కాలింగ్ అండ్ సెల్ఫీ విత్ పంచ్ హోల్ కటౌట్ ఇన్‌ది మెయిన్ డిస్ప్లే.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

