భూమిని తాకి వెళ్లిపోయిన భారీ సౌర తుఫాను

వాషింగ్టన్: ఓ భారీ సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తోంది. దీని కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థపై ప్రభావం పడనుందన్న వార్తలు తెలుసు కదా. అయితే ఆ సౌర తుఫాను బుధవారం సాయంత్రం భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయినట్లు తాజాగా అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) వెల్లడించింది. కొన్ని గంటల పాటు ఈ సౌర గాలులు భూమిని చుట్టుముట్టినట్లు తెలిపింది. అయితే వీటి కారణంగా గుర్తించదగిన మార్పులేమీ సంభవించలేదని స్పష్టం చేసింది. అయితే ఆ తుఫాను భూ అయాస్కాంత క్షేత్రంపై మాత్రం కాస్త ప్రభావం చూపినట్లు ఈ అమెరికన్ ఏజెన్సీ తెలిపింది.
భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.11 సమయంలో ఈ సౌర తుఫాను భూమి మీదుగా వెళ్లిపోయినట్లు చెప్పింది. దీని జియోమాగ్నెటిక్ కే-ఇండెక్స్ 4గా ఉంది. కే-ఇండెక్స్ అనేది జియోమాగ్నెటిక్ తుఫానుల తీవ్రతను తెలిపే సూచిక. లెవల్ 4 సూచిస్తోందంటే ఇది స్వల్పమైన ప్రభావం చూపినట్లు అర్థం. ఈ సౌర తుఫాను కారణంగా బలహీనమైన పవర్ గ్రిడ్ ఫ్లక్చువేషన్లు కనిపించాయని, ఇక కెనడా, అలాస్కాలాంటి ప్రాంతాల్లో అరోరాలు కూడా కనిపించినట్లు ఎన్ఓఏఏ వెల్లడించింది.
ఈ సౌర తుఫాను కంటికి కనిపించకపోయినా, భూమిపై ఉన్న వారికి ఎలాంటి హాని కలిగించకపోయినా.. దీని ద్వారా వచ్చిన జియోమాగ్నెటిక్ వేవ్స్ మాత్రం పవర్ గ్రిడ్లను పని చేయకుండా చేయగలవు. రేడియో కమ్యూనికేషన్లపై ప్రభావం చూపగలవు. 2017లో ఇలాంటి సౌర తుఫానే రేడియో కమ్యూనికేషన్లను దెబ్బతీశాయి. 2015లో ఈశాన్య అమెరికాలో జీపీఎస్ వ్యవస్థకు ఆటంకం కలిగించాయి. 1989లో అయితే కెనడాలోని క్యూబెక్ మీదుగా వెళ్లిన ఓ సౌర తుఫాను అక్కడి విద్యుత్ వ్యవస్థకు 9 గంటల పాటు అంతరాయం కలిగించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

