Solar Charging Battry | ఇక ఎలక్ట్రానిక్ వాహనాలకు సోలార్ ఛార్జింగ్.. టీఐఎఫ్ఆర్ శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ
Solar Charging Battry | సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలను సూర్యరశ్మి ద్వారా రీచార్జ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇదే ఆలోచన హైదరాబాద్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) శాస్త్రవేత్తలకు కూడా వచ్చింది. ఇంకేముంది.. ఆచరణలో పెట్టేశారు. ఫొటో రీచార్జిబుల్ లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేసేశారు.
Solar Charging Battry | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలను సూర్యరశ్మి ద్వారా రీచార్జ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇదే ఆలోచన హైదరాబాద్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) శాస్త్రవేత్తలకు కూడా వచ్చింది. ఇంకేముంది.. ఆచరణలో పెట్టేశారు. ఫొటో రీచార్జిబుల్ లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేసేశారు. సంస్థ శాస్త్రవేత్త టీఎన్ నారాయణన్ నేతృత్వంలోని బృందం.. పలు అధ్యయనాల అనంతరం సోలార్ చార్జింగ్ బ్యాటరీని ఆవిష్కరించారు. ఈ ప్రకియలో భాగంగా వీరు లిథియం అయాన్ బ్యాటరీల్లో మాలిబ్డినం సల్ఫేడ్, మాలిబ్డినం ఆక్సైడ్ల కలయిక అయిన హెటిరోస్ట్రక్చర్ను ఉపయోగించారు.
ఆ తర్వాత పూర్తిగా లిథియం స్థానంలో సగం గ్రాఫైట్‌ను వినియోగించి సూర్యకాంతి ద్వారా చార్జింగ్ చేసేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. సగం లిథియాన్ని కాథోడ్‌గా, మరో సగం గ్రాఫైట్‌ను ఆనోడ్‌గా వినియోగించి, విజయవంతంగా సౌరశక్తితో చార్జింగ్ కావటాన్ని గమనించారు. ఈ బ్యాటరీని విద్యుత్తు ద్వారా, సోలార్తోనూ రీచార్జ్ చేసుకోవచ్చని టీఎన్ నారాయణ్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. సెల్‌ఫోన్లల్లో వినియోగించే బ్యాటరీ సామర్థ్యం తరహాలోనే ఈ బ్యాటరీలు పనిచేస్తాయని వివరించారు. బ్యాటరీల పనితీరు మరింత సమర్థంగా ఉండేందుకు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన మైకేల్ డీ వోల్డర్స్ గ్రూప్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

