Samsung Galaxy S23 | మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్లు.. ఆన్లైన్ ప్రీ-బుకింగ్స్‌పై ఆకర్షణీయ ఆఫర్లు!
Samsung Galaxy S23 | శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్ల ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. ఆన్ లైన్ బుకింగ్స్ పై రూ.8000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.
Samsung Galaxy S23 | దేశీయ మార్కెట్లోకి దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ నుంచి అత్యంత శక్తిమంతమైన గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. ఇందులో గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్ ద్వారా ఈ నెల 17 నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ల ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. గెలాక్సీ ఎస్23 సిరీస్‌కు చెందిన ఈ మూడు ఫోన్లలోనూ క్వాల్కామ్ సెకండ్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్‌ను గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్పేస్ జూమ్ కోసం గెలాక్సీ ఎస్23 ఆల్ట్రాలో 200-మెగా పిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఈ ఫోన్ల ప్రీ-బుకింగ్స్‌పై రూ.8000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఇవీ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లపై ఆఫర్లు
- గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా ఫోన్ ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి ప్రత్యేక ధరపై గెలాక్సీ వాచ్4 ఎల్టీఈ క్లాసిక్, గెలాక్సీ బడ్స్2 లభ్యం.
- రూ.4298 ధర గల 22-వాట్ల ట్రావెల్ అడాప్టర్, వైర్లెస్ చార్జర్ ఉచితం.
- గెలాక్సీ ఎస్ 23 ప్లస్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ చేసుకున్న వారికి స్పెషల్ ధరపై రూ.4,999లకు గెలాక్సీ వాచ్4బీటీ లభ్యం.
- గెలాక్సీ ఎస్23 ఫోన్ ప్రీ-బుకింగ్స్ చేసుకుంటే రూ.5000తో స్టోరేజీ అప్‌గ్రేడ్ ఆప్షన్ లభ్యం.
- మూడు ఫోన్ల కోసం ఆన్లైన్ చానెల్స్‌లో ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్పెషిఫికేషన్లు ఇవీ..
- 6.1 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లే. ఇది 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌పై హెచ్డీఆర్10+కు సపోర్టివ్.
గొరిల్లా గ్లాస్ విక్టస్2 ప్రొటెక్షన్. - వన్ యూఐ 5.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 13 వర్షన్ ఆధారంగా పని చేస్తుంది.
- రేర్ ప్యానెల్‌పై మూడు కెమెరాల సెటప్. ప్రైమరీ లెన్స్ 50 ఎంపీ, సెకండ్ లెన్స్ 10 ఎంపీ టెలిఫోటో లెన్స్.. థర్డ్ లెన్స్ 12 ఎంపీ (త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్).
- వైర్లెస్ & వైర్డ్ చార్జింగ్కు సపోర్ట్‌గా గెలాక్సీ ఎస్23 ఫోన్‌కు 3900 ఏంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ లభ్యం.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ ఫీచర్లు ఇలా
- 6.6 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లే. 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ వద్ద హెచ్డీఆర్10+కు సపోర్టివ్.
గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ లభ్యం. - వన్ యూఐ 5.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 13 వర్షన్ ఆధారంగా పని చేస్తుంది.
- హార్డ్‌వేర్-సాఫ్ట్వేర్ సపోర్ట్ ఫీచర్లు లభ్యం. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 మాదిరిగానే త్రీ ఫోన్ సెటప్
- 4700 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ విత్ 25వాట్ల వైర్ చార్జింగ్ సపోర్ట్. వైర్‌లైస్ చార్జింగ్ ఫెసిలిటీ కూడా..
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా స్పెషిఫికేషన్స్..
- 6.8 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లే. 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్. హెచ్డీఆర్10+, 1750 నిట్స్ వద్ద గరిష్ట బ్రైట్నెస్ లభ్యం.
- గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్.
- వన్ యూఐ5.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 12 వర్షన్‌తో పని చేస్తుంది.
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ జనరేషన్ 2 కస్టమ్ ప్రాసెసర్.
- 12జీబీ రామ్‌తోపాటు ఒక టిగా బైట్ స్టోరేజీకి సపోర్టివ్.
- రేర్ ప్యానెల్‌పై 4 కెమెరా సెటప్ లభ్యం.
- ప్రైమరీ లెన్స్ కెమెరా 200 ఎంపీ ఐసోసెల్ హెచ్‌పీ సెన్సర్‌తో లభ్యం.
- సెకండ్ లెన్స్ కెమెరా 12 ఎంపీ ఆల్ట్రావైడ్ సెన్సర్తోనూ.. మిగతా రెండు టెలిఫొటో లెన్స్‌తో 10-10 ఎంపీ సామర్థ్యంతో లభ్యం.
- కెమెరాపై ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, వీడీఐఎస్ లభ్యం.
- కెమెరాలో 100 ఎక్స్ స్పేస్ జూమ్ ఫెసిలిటీ, ఆస్ట్రో మోడ్ కూడా..
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం విత్ 45 వాట్స్ చార్జర్.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

