Chandrayaan-3 | మన చంద్రయాన్-3, రష్యా లూనా-25.. ఈ రెండింటిలో ఏది ముందు చంద్రుడిని చేరుతుందో!
Chandrayan-3 | లూనా-25 మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొన్నది. ఈ రెండింటిలో ఏది ముందు చంద్రుడిపై ల్యాండ్ అవుతుందనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. చంద్రయాన్-3 ఆగస్టు 23న ల్యాండ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. అయితే రష్యా అంతరిక్ష కేంద్రం మాత్రం లూనా-25 ల్యాండింగ్‌పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
Chandrayaan-3 | న్యూఢిల్లీ: చంద్రయాన్-3, లూనా-25 మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొన్నది. ఈ రెండింటిలో ఏది ముందు చంద్రుడిపై ల్యాండ్ అవుతుందనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. చంద్రయాన్-3 ఆగస్టు 23న ల్యాండ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. అయితే రష్యా అంతరిక్ష కేంద్రం మాత్రం లూనా-25 ల్యాండింగ్‌పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
వెలుతురు ఆధారంగా ల్యాండింగ్
చంద్రుడిపై ల్యాండింగ్‌కు వెలుతురు ఎంతో ముఖ్యం. చంద్రుడి ఉపరితలంపై ఆగస్టు 23న పగలు మొదలవుతుంది. ఇస్రో అదే రోజు ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ రష్యా మాత్రం ఆగస్టు 21-23 మధ్య ఏ రోజు అనేది స్పష్టంగా చెప్పడం లేదు. వెలుతురును దృష్టిలో ఉంచుకొని చూస్తే రెండూ స్వల్ప సమయం తేడాతో ల్యాండ్ అయ్యే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
బరువే చంద్రయాన్‌కు ప్రతికూలం
చంద్రయాన్-3 సుమారు 40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడిపై కాలు మోపనున్నది. కానీ లూనా-25 మాత్రం 11 రోజుల వ్యవధిలోనే చంద్రుడ్ని చేరుకునే అవకాశం ఉన్నది. సామర్థ్యంలో ఉన్న తేడానే దీనికి కారణంగా తెలుస్తున్నది. తక్కువ బరువు, అధిక ఇంధన సామర్థ్యం ఉన్న కారణంగా లూనా-25 వేగంగా చంద్రుడిని చేరుకుంటున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 3900 కిలోలు ఉండటం కూడా చంద్రయాన్-3కి ప్రతికూలంగా మారింది. లూనా-25 బరువు కేవలం 1750 కిలోలు. చంద్రుడిపైకి చేరుకున్న తర్వాత చంద్రయాన్-3కి సంబంధించిన రోవర్ 14 రోజులు పరిశోధనలు జరపనుండగా, లూనా-25 మాత్రం ఏడాది పాటు పని చేయనున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- chandrayaan-3
- ISRO
- Luna-25
- Moon
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
Air India Flight: కోల్‌కతాలో హైజాక్ అలర్ట్ జారీ చేసిన ఎయిర్ ఇండియా పైలట్
Vijayasai Reddy | ఏపీలో మరో రాజకీయ పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!
Hyderabad | రెండు నెలల్లో 9 మంది జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మృతి..!
Vishwambara | మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సైలెంట్‌గా పనులు పూర్తి చేస్తున్న వశిష్ఠ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

