స్పేస్‌లో తొలి మూవీ షూటింగ్.. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రష్యా యాక్టర్, డైరెక్టర్
ప్రపంచంలోనే తొలిసారి స్పేస్‌లో సినిమా షూటింగ్ కోసం ఓ రష్యా యాక్టర్, డైరెక్టర్ మంగళవారం నింగిలోకి దూసుకెళ్లారు. రష్యాకు చెందిన నటి యూలియా పెరెసిల్డ్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకోలను కాస్మోనాట్ ఆంటోన్ ష్కాప్లెరోవ్ రష్యన్ సోయెజ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి తీసుకెళ్లారు.

మాస్కో: ప్రపంచంలోనే తొలిసారి స్పేస్‌లో సినిమా షూటింగ్ కోసం ఓ రష్యా యాక్టర్, డైరెక్టర్ మంగళవారం నింగిలోకి దూసుకెళ్లారు. రష్యాకు చెందిన నటి యూలియా పెరెసిల్డ్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకోలను కాస్మోనాట్ ఆంటోన్ ష్కాప్లెరోవ్ రష్యన్ సోయెజ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి ఎగిరింది. కజక్స్తాన్లోని బైకనూర్‌లో ఉన్న రష్యన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ సోయెస్ స్పేస్‌క్రాఫ్ట్‌ను లాంచ్ చేశారు. వీళ్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు.
చాలెంజ్ అనే కొత్త మూవీ కోసం పెరిసిల్డ్, క్లిమెంకోలు స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. 12 రోజుల పాటు వీళ్లు స్పేస్ స్టేషన్లోనే ఉండనున్నారు. ఆ తర్వాత వీళ్లను మరో రష్యన్ కాస్మోనాట్ భూమి మీదికి తీసుకు వస్తారు. అంతరిక్షంలోకి వెళ్లే ముందు పొందిన శిక్షణ తనకో సవాలని స్పేస్‌క్రాఫ్ట్ ఎక్కే ముందు నటి పెరెసిల్డ్ చెప్పింది. డైరెక్టర్ షిపెంకోతో కలిసి ఆమె నాలుగు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంది. స్పేస్‌లో మూవీ షూటింగ్‌ను రష్యన్ మీడియాలో కొందరు తీవ్రంగా విమర్శించినా లెక్క చేయకుండా రష్యన్ స్పేస్ కార్పొరేషన్ రాస్‌కాస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ ఈ మిషన్‌లో కీలక పాత్ర పోషించారు.
ఇలా స్పేస్ స్టేషన్లో మూవీ షూటింగ్ వల్ల అక్కడి రష్యన్ కాస్మోనాట్ల ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉన్నదని రష్యాలోని కొందరు విమర్శిస్తున్నారు. అందులోనూ స్పేస్ స్టేషన్లో అమెరికాతో పోలిస్తే రష్యాకు ఉన్న స్పేస్ తక్కువని, అందులో షూటింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుందని వాళ్లు అన్నారు. ఈ సినిమా సిబ్బంది మూడు గంటల పాటు సోయెజ్లో ప్రయాణించి వీళ్లు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ చేరుకుంటారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

