ఆకట్టుకోనున్న ఫైర్‌బోల్ట్ గ్లాడియేటర్ : తక్కువ ధరలోనే యాపిల్ వాచ్ అల్ట్రాను పోలిన స్మార్ట్‌వాచ్
ఐఫోన్ 14 సిరీస్‌తో పాటుగా యాపిల్ అత్యంత ఖరీదైన స్మార్ట్‌వాచ్ వాచ్ అల్ట్రాను లాంఛ్ చేసింది. వాచ్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ రగ్గ్డ్ లుక్‌తో మెరుగైన సామర్ధ్యంతో కూడిన యాపిల్ వాచ్‌గా పేరొందింది. .
న్యూఢిల్లీ : ఐఫోన్ 14 సిరీస్‌తో పాటుగా యాపిల్ అత్యంత ఖరీదైన స్మార్ట్‌వాచ్ వాచ్ అల్ట్రాను లాంఛ్ చేసింది. వాచ్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ రగ్గ్డ్ లుక్‌తో మెరుగైన సామర్ధ్యంతో కూడిన యాపిల్ వాచ్‌గా పేరొందింది. ప్రీమియం లుక్స్‌తో కూడిన టైటానియం బిల్డ్ వాచ్ అల్ట్రాను అథ్లెట్లు, అడ్వంచరర్స్ను దృష్టిలో ఉంచుకుని ఈ వాచ్‌ను స్పెషల్‌గా డిజైన్ చేశారు.
ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 89,900 కావడంతో పెద్దసంఖ్యలో భారతీయులకు ఈ వాచ్ అందుబాటులో లేదనే చెప్పాలి. అయితే రూ. 3000లోపే యాపిల్ వాచ్ అల్ట్రా తరహాలో ఉండే స్మార్ట్‌వాచ్ త్వరలో మార్కటె్లోకి రానుంది. భారత స్మార్ట్ వేరబుల్ బ్రాండ్ ఫైర్‌బోల్ట్ యాపిల్ వాచ్ అల్ట్రాను పోలిన స్మార్ట్‌వాచ్‌ను అందుబాటు ధరలో లాంఛ్ చేస్తోంది.
డిజైన్ పరంగా యాపిల్ వాచ్ అల్ట్రాను గుర్తుకుతెచ్చేలా ఫైర్‌బోల్ట్ గ్లాడియేటర్ కేవలం రూ. 2499కే లభించనుంది. ఈ స్మార్ట్‌వాచ్ ధరను కంపెనీ ఇంకా నిర్ధారించకున్నా ఫైర్‌బోల్ట్ గ్లాడియేటర్ ధర రూ. 3000లోపే ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 30న ఈ డివైజ్ అధికారిక ధరను కంపెనీ వెల్లడించనుంది. ప్రస్తుతం ఈ వాచ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో అమెజాన్ ఇండియాలో ప్రస్తుతం లిస్టయింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

