మార్కెట్లోకి కొత్త రోబో కుక్క.. ఎగబడి కొంటున్న జనం

బీజింగ్ : అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన రోబో డాగ్ పేరు స్పాట్. దీనికి పోటీగా చైనా తన సొంత రోబో కుక్క ఆల్ఫా డాగ్ ను ఆవిష్కరించింది. బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన రోబో కుక్క పారిశ్రామిక అవసరాలకు ఉద్దేశించింది. ప్రస్తుతం దీని వీడియోలు యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి. కానీ చైనా రోబో కుక్క పెంపుడు జంతువులా ఉపయోగించుకునేందుకు అంటున్నారు. పెంపుడు జంతువులు, టెక్నాలజీ అంటే చైనీయులు పడి చస్తారు. ఆ రెండింటిని కలగలిపి నాంజింగ్ లోని వైయిలాన్ కంపెనీ ఆల్ఫాను రూపొందించింది.
ఇది చెప్పినట్టు తోకాడించడమే కాకుండా పరిసరాలను తన కృత్రిమ మేధస్సు సాయంతో అర్థం చేసుకుని మెదులుతుంది. ఆల్ఫాను పూర్తిగా వ్యక్తిగత అవసరాల కోసం తయారు చేశారు. మార్కెట్లో స్పందన కూడా బాగానే ఉందంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు దీని చేష్టలు చాలా నచ్చినట్టున్నాయి. నాలుగు బలమైన కాళ్లతో ఇది మామూలు కుక్కకన్నా స్థిరంగానే నిలబడుతుంది. కంపెనీ ఆ సంగతి రుజువు చేసేందుకు రోబో కుక్కను తన్నే వీడియోలను యాడ్ లలో ఉపయోగిస్తున్నది. అంటే ఎటువైపు నుంచి ఎలా తన్నిననా అది పడిపోకుండా నిలిచి ఉంటుందని చెప్పడమన్నమాట.
ఒక్కో కుక్క ధర భారీగా 2,400 డాలర్లు అంటే లక్షా 80 వేలు పెట్టినా అమ్మకాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి. లాంచ్ చేసిన నెలరోజులలోనే 1800 ఆల్ఫా రోబ్ డాగ్ లు అమ్ముడయ్యాయి. కంప్యూటర్ డెవలపర్లు, టెక్నాలజీ ప్రేమికులు, పిల్లల నుంచి ఎక్కువ గా ఆర్డర్లు వస్తున్నాయి. భవిష్యత్తులో కంటిచూపు లేనివాళ్లు కూడా ఈ రోబో కుక్కలను వినియోగించుకుంటారని కంపెనీ ఆశిస్తున్నది.

Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

