OpenAI Sora : ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీతో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన ఓపెన్ఏఐ మరో వినూత్న ఆవిష్కరణతో సంచలనం సృష్టించింది. సొరా పేరిట ఔరా అనిపించే ఏఐ మోడల్‌ను ఓపెన్ఏఐ ప్రవేశపెట్టింది. టెక్ట్స్ ప్రాంప్ట్స్ నుంచి ఈ ఏఐ మోడల్ నిమిషం వ్యవధి కలిగిన వీడియోలను క్రియేట్ చేస్తుంది.
ఓపెన్ఏఐ సొరా ప్రస్తుతం అంతర్గత టెస్టర్స్, కొందరు ఆర్టిస్టులు, డిజైనర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాస్తవ ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సాయపడే మోడల్స్‌పై కసరత్తు సాగిస్తున్నామని ఓపెన్ఏఐ సొరా బ్లాగ్ పేర్కొంది.
ఓపెన్ఏఐ సీఈవో సామ్ అల్ట్మన్ కూడా తన ఎక్స్ అకౌంట్ వేదికగా ఈ టూల్‌ను ప్రదర్శించారు. ఇక ఈ ప్లాట్‌ఫాంపై పలువురు యూజర్లు టెక్ట్స్ ప్రాంప్ట్స్ పంపగా అల్ట్మన్ పంపిన వీడియోలు వాస్తవికతకు చాలా దగ్గరగా ఉన్నాయి. మరో ఓపెన్ఏఐ సభ్యుడు సొరా క్రియేట్ చేసిన వీడియోను షేర్ చేయగా అది రియల్ వీడియో అనిపించేలా ఉంది.
Read More :