ఆకట్టుకొంటున్న జుపిటర్ కొత్త చిత్రాలు… జూలై 27న తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
వాషింగ్టన్: బృహస్పతి గ్రహం (జుపిటర్)కు సంబంధించిన కొత్త చిత్రాలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపింది. ఆ గ్రహం చుట్టూ ఉన్న వలయాలు, వాయువులతో కూడిన ఉపరితల వాతావరణాన్ని స్పష్టంగా చూపింది. జూలై 27న జుపిటర్ కొత్త ఫొటోలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసినట్లు నాసా తెలిపింది. ఆ ప్లానెట్ నిర్దిష్ట లక్షణాలను గుర్తించడానికి ఈ చిత్రాలను డిజిటల్‌గా మెరుగుపరిచినట్లు వెల్లడించింది. బృహస్పతి గ్రహం ఉత్తర, దక్షిణ ధ్రువాలపై అరోరాస్ ఎంతో అందంగా ఉన్నాయని తెలిపింది. జుపిటర్ అంతర్గత జీవితానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు శాస్త్రవేత్తలకు లభించవచ్చని పేర్కొంది.
మరోవైపు ఉల్కల దాడి వల్ల పని చేయదని భావించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్, తాజాగా జుపిటర్ చిత్రాలను ఇంత స్పష్టంగా తీయడాన్ని తాము నిజంగా ఊహించలేదంటూ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్, ఎమెరిటా గ్రహ ఖగోళ శాస్త్రవేత్త ఇమ్కే డి పాటర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బృహస్పతిపై వలయాలు, చిన్న ఉపగ్రహాలు, గెలాక్సీలతో కూడిన వివరాలను ఒకే చిత్రంలో చూడటం ఎంతో విశేషమని అన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

