Naya Mall | నెక్సస్.. నెక్ట్స్ లెవెల్!
సాంకేతిక రంగంలో ‘చాట్ జీపీటీ’ ఓ సంచలనం. ఈ ఆధునిక టెక్నాలజీ.. ఇప్పుడు స్మార్ట్వాచీలోకీ వచ్చి చేరింది. దేశీయ బ్రాండ్ ‘క్రాస్‌బీట్స్’.. ‘నెక్సస్’ పేరుతో చాట్ జీపీటీ స్మార్ట్‌వాచీని తీసుకొచ్చింది. ఈ సాంకేతికతతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ ఇదే! అంతేకాదు.. ఈ స్మార్ట్‌వాచీలో తొలి సారిగా ఈ-బుక్ రీడర్నూ అందుబాటులో ఉంచింది. 2.1 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతోపాటు యాంటీ-గ్లేర్ స్క్రీన్ వల్ల రంగులన్నీ క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తాయి. ఇందులో 500 కస్టమైజ్డ్ వాచ్ఫేసులు అందుబాటులో ఉంటాయి. ఇందులో మరో ఆసక్తికర ఫీచర్.. ‘డైనమిక్ ఐల్యాండ్’. ఐఫోన్లలో ఉండే ఈ ఫీచర్ సాయంతో నోటిఫికేషన్లను వేగంగా చూడొచ్చు. మిగతా స్మార్ట్‌వాచీల్లో ఉండే అన్ని రకాల హెల్త్ ఫీచర్లు ఇందులోనూ ఉన్నాయి. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఏడురోజుల దాకా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఈ స్మార్ట్‌వాచ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుంది. బ్లాక్ అండ్ సిల్వర్ వేరియంట్లలో లభించే నెక్సస్ స్మార్ట్‌వాచ్ ధర.. రూ.4,999. crossbeats.comతోపాటు అన్ని ఆన్లైన్ స్టోర్లలోనూ దొరుకుతుంది.
ఆన్ జూమ్ క్లిక్
ఫొటోగ్రఫీ కొత్తపుంతలు తొక్కుతున్నది. ఈవెంట్ – వైల్డ్‌లైఫ్- స్ట్రీట్ ఫొటోగ్రాఫర్ల సంఖ్య.. రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ క్రమంలో ఫుల్‌ఫ్రేమ్ మిర్రర్‌లెస్ కెమెరాల కోసం సిగ్మా సంస్థ.. సరికొత్త లెన్స్‌ను విడుదల చేసింది. 70 – 200 ఎంఎం ఫోకల్ లెంత్‌తో, అత్యాధునిక ఫీచర్లతో ఈ స్పోర్ట్స్ లెన్స్ పనిచేస్తుంది. ఇందులో ఎఫ్2.8 అపార్చర్, అధునాతన ఆటోఫోకస్ సిస్టమ్ ద్వారా అద్భుతమైన ఫొటోలు తీయవచ్చు. అంతేకాదు.. అపార్చర్ రింగ్‌తో వచ్చిన మొట్టమొదటి సిగ్మా డీఎన్ జూమ్‌లెన్స్ కూడా ఇదే! ఇన్‌బిల్ట్ జూమ్.. ఈ లెన్స్ మరో ప్రత్యేకత. జూమ్ ఇన్ లేదా జూమ్ అవుట్ చేసినప్పుడు.. లెన్స్ బ్యారెల్ పెరగదు. దీనివల్ల రద్దీగా ఉండే ఈవెంట్లలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫొటోలు తీసుకోవచ్చు. 7.5 స్టాప్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ద్వారా ట్రైపాడ్ – మోనోపాడ్లాంటివి ఉపయోగించకుండానే.. నాణ్యమైన ఫొటోలు తీసే వీలుంది. ఫొటోగ్రాఫర్లతోపాటు వీడియోగ్రాఫర్లకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సోనీ ఇ-మౌంట్, లైకా ఎల్-మౌంట్ వేరియంట్లలో లభించే ఈ లెన్స్ ఖరీదు.. రూ.1.25 లక్షల నుంచి ప్రారంభం. sigma-global.comతోపాటు ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.
పొలతి కోసం పొట్లీ..
హ్యాండ్‌బ్యాగ్.. ఆడవారి ఫ్యాషన్‌లో అంతర్భాగమైంది. ఎంతలా అంటే.. అది లేకుండా, పడతుల ఫ్యాషన్‌ను ఊహించలేనంతగా! అలాంటి బ్యాగు.. సాదాసీదాగా ఉంటే ఎలా? మగువల మనసు తెలిసిన తొరానీ సంస్థ.. సరికొత్త ‘పొట్లీ’లను మార్కెట్లోకి తెచ్చింది. లగ్జరీతోపాటు కంఫర్ట్ కోరుకునే వారికోసం సిల్క్ వెల్వెట్, కాటన్ సిల్క్ వస్ర్తాలతో బుల్లి బుల్లి పొట్లీలకు ప్రాణం పోసింది. రాజస్థాన్ సంప్రదాయ గోటా ఎంబ్రాయిడరీతో రాయల్ లుక్ తీసుకొచ్చింది. ఫ్యాన్సీ డ్రెస్సులైనా.. సంప్రదాయ దుస్తులైనా.. అన్నిటికీ నప్పేలా రూపొందించింది. చిన్నసైజుల్లో.. ఎలాంటి అవుట్‌ఫిట్ అయినా అదిరిపోతాయి. వివిధ రంగుల్లో లభ్యమయ్యే ఈ పొట్లీల ధర.. రూ.14,500 నుంచి ప్రారంభం. torani.in వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు.
వండర్.. బ్లెండర్!
పండ్లను జ్యూస్, స్మూతీ, షేక్‌ల రూపంలో తీసుకునేవారే ఎక్కువ. అయితే, మిక్సీ పట్టినప్పుడు వివిధ ఆహార పదార్థాలు పోషకాలను కోల్పోతాయి. ఈ నష్టాన్ని నివారించడానికి వండర్ చెఫ్.. ఆధునిక ఫీచర్లతో ఓ బ్లెండర్‌ను తీసుకొచ్చింది. ‘న్యూట్రీ బ్లెండ్ స్మార్ట్’గా పిలిచే ఈ పరికరం.. ఆహార పదార్థాల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలను కోల్పోకుండా చూస్తుంది. ఫలితంగా.. ప్రతిసారీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది. ఇందులోని బ్లెండింగ్ జార్.. బాటిల్ ఆకారంలో ఉండటం మరో ప్రత్యేకత. స్మూతీ లేదా షేక్ చేసుకున్నప్పుడు వేరే బాటిల్లోకి మార్చాల్సిన అవసరం ఉండదు. స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లు ఉపయోగించడం వల్ల తుప్పు పట్టకుండా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. కాంపాక్ట్ డిజైన్‌తో చిన్న వంటగదుల్లోనైనా ఇట్టే అమరిపోతుంది. ‘వన్-టచ్’ ఫంక్షన్లతో పనిచేసే ఈ స్మార్ట్ బ్లెండర్ ధర.. రూ. 3,699. wonderchef.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.