Moto G22 | త్వరలో రానున్న మోటో జీ22.. స్పెసిఫికేషన్స్ లీక్!
మొటోరోలా మోటో జీ22 త్వరలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. నాలుగు కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్‌తో కూడిన ఈ హ్యాండ్సెట్ గురించి లీకులు బయటకువచ్చాయి.
న్యూఢిల్లీ : మొటోరోలా మోటో జీ22 త్వరలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. నాలుగు కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్‌తో కూడిన ఈ హ్యాండ్సెట్ గురించి లీకులు బయటకువచ్చాయి. హైరిజల్యూషన్ రెండర్స్తో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇమేజ్‌లు Winfuture.deలో దర్శనమిచ్చాయి. మోటో జీ22 స్పెసిఫికేషన్స్పైనా ఇందులో పలు వివరాలను వెల్లడించారు. మోటో జీ22 6.53 ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో సెంట్రల్ పొజిషన్ పంచ్ హోల్‌తో లీకైన ఇమేజ్ ఆకట్టుకుంటోంది.
ఫోన్ ముందు భాగంలో 16ఎంపీ సెల్ఫీ కెమరా ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ వీడియోలను రికార్డు చేసే సామర్ధ్యం కలిగిఉంది. రియర్ సైడ్ 50ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, రెండు 2ఎంపీ లెన్స్‌లు డెప్త్ ఎఫెక్ట్స్‌తో పాటు మ్యాక్రో ఇమేజ్‌లను మెరుగ్గా క్యాప్చర్ చేస్తాయి. ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై మొటోరోలా లోగో ఆకట్టుకుంటుంది.
ఇక మోటో జీ22 మీడియాటెక్ హిలియో జీ37 ప్రాసెసర్‌ను కలిగిఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది. మోటో జీ22 10డబ్ల్యూ చార్జింగ్క సపోర్ట్ చేసే 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ 5జీ కనెక్టివిటీ లేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తోంది. ఇక మోటో జీ22 ధర, లభ్యత గురించి ఇంకా స్పష్టమైన వివరాలు వెల్లడికాలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని ప్రాంతాల్లో లెనోవా కే15+ గా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

