AlterEgo | ఇకపై నోరు తెరవకుండానే మాట్లాడొచ్చు… మూగవాళ్లకు ఇది నిజంగా వరమే!
AlterEgo | కృత్రిమ మేధ సాయంతో ఓ భారతీయ విద్యార్థి అద్భుత పరికరాన్ని ఆవిష్కరించాడు. అవతలివారి నోటి నుంచి మాట రాకపోయినా, ‘లోపల’ ఏం మాట్లాడుకున్నాడో తెలుసుకోవచ్చు. ‘బయటకు’ మాట్లాడకుండానే వారితో సంభాషించవచ్చు కూడా.
AlterEgo | కృత్రిమ మేధ సాయంతో ఓ భారతీయ విద్యార్థి అద్భుత పరికరాన్ని ఆవిష్కరించాడు. అవతలివారి నోటి నుంచి మాట రాకపోయినా, ‘లోపల’ ఏం మాట్లాడుకున్నాడో తెలుసుకోవచ్చు. ‘బయటకు’ మాట్లాడకుండానే వారితో సంభాషించవచ్చు కూడా.
న్యూయార్క్, జూలై 22: అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) విద్యార్థి అద్భుతాన్ని ఆవిష్కరించారు. నోరు కదపకుండానే ఇతరులతో మాట్లాడుకునే ఓ పరికరాన్ని అతను కనుగొన్నారు. మనుషులతో పాటు మెషిన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసే టూల్స్, ఏఐ అసిస్టెంట్‌తోనూ దీని సాయంతో సంభాషించవచ్చు. ఈ పరికరం సాయంతో మనుషులు తమ నోటిని తెరవకుండా, కదపకుండా మాట్లాడుకోవచ్చు. కనీసం చేతి సైగలు కూడా చేయనవసరం లేదు. అంతర్గతంగా నోట్లో ఉచ్చరించే పదాలను ఇది ఇతరులకు చేరవేస్తుంది. ఆల్టర్ఈగో అనే ఈ పరికరాన్ని ఎంఐటీలో చదివే ఢిల్లీకి చెందిన అర్ణవ్ కపూర్ ఆవిష్కరించారు.
నాడీ సంకేతాలను గ్రహించి…
ఎంఐటీ మీడియా ల్యాబ్స్ వెబ్సైట్ దీని గురించి వెల్లడించింది. ఈ పరికరాన్ని ధరించిన వ్యక్తి అంతర్గతంగా ఉచ్చరించినప్పుడు అతని నాడీ సంకేతాలను ఇది గ్రహిస్తుంది. తద్వారా అతను అంతర్గతంగా ఉచ్చరించే పదాలను అవతలి వారికి ఇది చేరవేస్తుంది. ఈ పరికరాన్ని ధరించి కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీడియో వైరల్‌గా మారింది. వినియోగదారుని గోప్యతను కాపాడుతూనే ఈ పరికరం ఒకరి నుంచి మరొకరికి మాటలను చేరవేస్తుందని ఎంఐటీ తెలిపింది. బధిరులకు ఈ పరికరం ఉపయోగపడుతుందని పేర్కొంది. మాటలు రాని వారికి ఆల్టర్ఈగో ద్వారా సాయం చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని ఎంఐటీ వెబ్సైట్ తెలిపింది. నాడీ సంబంధిత వ్యాధులైన అమియోట్రోఫ్రిక్ లెటరర్ స్లెరోసిస్, మల్టీపుల్ స్లెరోసిస్తో బాధపడుతున్న వారు సైతం ఇతరులతో సంభాషించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

