27 ఏండ్ల ప్రస్థానానికి తెర.. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పతనానికి కారణమేంటి?
Internet Explorer | మీ కంప్యూటర్లో ఏ బ్రౌజర్ వాడుతున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే కొందరు గూగుల్ క్రోమ్ అని.. ఇంకొందరు మజిలా ఫైర్ఫాక్స్ అని.. మరికొందరు ఒపెరా అని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో బ్రౌజర్ పేరు చెబుతారు. కానీ కంప్యూటర్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో చాలామందికి తెలిసిన ఒకే ఒక్క బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఈ ప్రొడొక్ట్ అప్పట్లో ఇంటర్నెట్ రంగాన్ని శాసించిందనే చెప్పొచ్చు. దాదాపు 27 ఏండ్లుగా సేవలు అందిస్తున్న ఈ బ్రౌజర్ కథ ఇక గత చరిత్ర మాత్రమే ! అవును రేపట్నుంచి ( జూన్ 15వ తేదీ ) ఈ బ్రౌజర్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని యూజర్లకు మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ యూజర్లకు తెలియజేసింది కూడా. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? ఇతర బ్రౌజర్లతో పోటీపడలేక ఎందుకు కనుమరుగవుతుందనే విషయాలు ఒకసారి చూద్దాం..
ఇప్పుడంటే ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది.. అరచేతిలో ఉండే మొబైల్ నుంచి అన్ని పనులను కానిచ్చేస్తున్నాం.. కానీ ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. అప్పట్లో బ్రౌజర్ల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. అలాంటి సమయంలో.. 1995 ఆగస్టులో విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ తీసుకొచ్చింది. మొదట్లో ప్రీమియం సర్వీస్‌గా ఉన్నప్పటికీ ఆ తర్వాత దాన్ని కస్టమర్లకు ఉచితంగా అందించింది. అప్పట్నుంచి జనాల్లోకి వెళ్లిన ఈ బ్రౌజర్ అనతి కాలంలోనే టాప్‌గా నిలిచింది. 2003లో ఇంటర్నెట్ బ్రౌజర్లలో 95 శాతం వాడకం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్దే. అంతలా ఆదరణ పొందిన ఈ బ్రౌజర్.. కస్టమర్లకు కావాల్సినన్నీ సేవలు అందించడంలో వెనుకబడిపోయింది.

ఫైర్ఫాక్స్, ఒపెరా, గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్లు రావడంతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు ఆదరణ తగ్గిపోయింది. ఐఈతో పోలిస్తే మిగిలిన బ్రౌజర్లలో ఫీచర్లు ఎక్కువగా ఉండటమే కాకుండా పేజి లోడింగ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉండేది. దీంతో ఆ బ్రౌజర్ల పోటీని ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తట్టుకోలేకపోయింది. తమ బ్రౌజర్లలో పలు మార్పులు చేసినప్పటికీ అవి కస్టమర్లను ఆకట్టుకోలేకపోయాయి. అలా కొద్దిరోజులకు మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక డిఫాల్ట్ బ్రౌజర్‌గా మిగిలిపోయింది తప్ప కస్టమర్లకు చేరువకాలేకపోయింది. దీంతో ఈ బ్రౌజర్లో ఫీచర్స్‌ను డెవలప్ చేయడం కూడా మానేసింది.
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు ఆదరణ తగ్గిపోవడంపై దృష్టిసారించిన మైక్రోసాఫ్ట్ సంస్థ.. ఐఈ స్థానంలో అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో మళ్లీ రావాలని నిర్ణయించుకుంది. అలా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో ఎడ్జ్ బ్రౌజర్‌ను తీసుకొచ్చింది. ఇది వేగవంతమైన బ్రౌజర్ మాత్రమే కాదని.. సెక్యూరిటీ పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందని మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రతినిధులు పలుమార్లు చెప్పారు. ఇక ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పూర్తిగా పనిచేయకుండా పోతున్న క్రమంలో ఆ బ్రౌజర్ ఆధారిత వెబ్సైట్లు అన్నింటినీ ఎడ్జ్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
ProductHunt: After 27 years of service, Microsoft is going to retire Internet Explorer for good on June 15th. pic.twitter.com/EEpvrx34FQ
— ProductGram (@ProductGrams) June 12, 2022
ఏదేమైనా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలను మైక్రోసాఫ్ట్ నిలిపేస్తుండటం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. 90వ, 2000వ దశకంలో ఈ బ్రౌజర్‌తో అనుబంధం ఉన్న చాలామంది యూజర్లు ఎమోషనల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Read More :
ఎంతసేపూ క్రోమ్ , ఎడ్జ్ బ్రౌజర్లేనా? వీటిపైనా ఓ లుక్కేయండి
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
“నంబర్ సేవ్ చేయకున్నా వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!”
Shortcuts : వాట్సాప్ వెబ్ లో షార్ట్‌కట్స్ గురించి తెలుసా..? అవేంటంటే..?”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

