Micro Camera | ఇసుక రేణువంత చిన్న కెమెరా.. తయారు చేసిన పరిశోధకులు
Micro Camera | కెమెరా అంటే ఎంత సైజు ఉంటుంది? ఎంత చిన్న సైజులో చూసుకున్నా అరచేయంత ఉంటుంది కదా. అలా అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే తాజాగా అమెరికాలోని కొందరు పరిశోధకులు

కెమెరా అంటే ఎంత సైజు ఉంటుంది? ఎంత చిన్న సైజులో చూసుకున్నా అరచేయంత ఉంటుంది కదా. అలా అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే తాజాగా అమెరికాలోని కొందరు పరిశోధకులు అత్యంత చిన్నసైజులో ఉండే కెమెరాను తయారు చేశారు. ఇది ఎంత పరిమాణంలో ఉంటుందో తెలుసా? ఇసుక రేణువంత!
నిజమేనండీ ఈ చిన్న కెమెరాను ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా తయారుచేశారు. దీన్ని ‘మెటాసర్ఫేస్’ అనే టెక్నాలజీ సాయంతో తయారు చేశారట. సుమారు 16 లక్షల సిలిండ్రికల్ పోస్టులను కూర్చి ఈ కెమెరా సిద్ధం చేశారు. కంప్యూటర్ చిప్‌లు ఉత్పత్తి చేసినట్లే ఈ కెమెరాను కూడా భారీగా ఉత్పత్తి చేయొచ్చని పరిశోధకులు తెలియజేశారు.

ఇక్కడ మరో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంతకు ముందు తయారు చేయడానికి ప్రయత్నించిన మెటాసర్ఫేస్ కెమెరాలతో పోలిస్తే ఇప్పుడు సిద్ధం చేసిన కెమెరా ఎన్నో రెట్లు స్పష్టమైన ఫొటోలను అందిస్తోంది. వస్తువుల చివర్లు కొంచెం బ్లర్ అవడం అటుంచితే.. దాదాపు సాధారణ కెమెరాతో తీసిన ఫొటోలానే ఉన్నాయీ ‘మెటాసర్ఫేస్’ ఫొటోలు.

ఈ కెమెరా కన్నా 5 లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను కూడా ఈ కెమెరా సులభంగా ఫొటోలు తీసేస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ కెమెరాను వైద్యరంగంలో ఉపయోగించి ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

