Meta New Rule | వర్చువల్ వేధింపులకు చెక్ పెట్టే పనిలో ‘మెటా’.. కొత్త ఫీచర్ తెచ్చిన కంపెనీ!
సామాజిక మాధ్యమాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ‘మెటా’ను ఏర్పాటు చేశాడు మార్క్ జుకర్‌బర్గ్. ఈ ఫేస్బుక్ వ్యవస్థాపకుడి ఆలోచన చాలా మందికి నచ్చింది. ఈ క్రమంలోనే వర్చువల్ టూల్స్‌తో మెటావర్స్‌లోకి వచ్చేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.
సామాజిక మాధ్యమాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ‘మెటా’ను ఏర్పాటు చేశాడు మార్క్ జుకర్‌బర్గ్. ఈ ఫేస్బుక్ వ్యవస్థాపకుడి ఆలోచన చాలా మందికి నచ్చింది. ఈ క్రమంలోనే వర్చువల్ టూల్స్‌తో మెటావర్స్‌లోకి వచ్చేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. కానీ ఇలా వర్చువల్ రియాలిటీలోకి వచ్చేవారిపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి.
చాలా మంది మహిళలు తమ ఆన్లైన్ అవతార్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదులు చేశారు. ఇటీవల ఒక మహిళ తన అవతార్‌పై కొన్ని మగ అవతార్లు ‘వర్చువల్ గ్యాంగ్ రేప్’ చేశాయని ఆరోపించింది. ఈ క్రమంలో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు మెటా ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇదే ‘వ్యక్తిగత సరిహద్దు’. దీని వల్ల అవతార్ చుట్టూ సుమారు 4 అడుగుల దూరం ఖాళీ ఉంటుంది.

ఆ ప్రాంతంలోకి ఇతర అవతార్లు ప్రవేశించడం కుదరదు. ఎవరైనా బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే సదరు అవతార్ చేతులు మాయమైపోతాయని మెటా వివరించింది. కాగా, గురువారం నాడు మెటా షేర్లు 26 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. యాపిల్ తెచ్చిన కొత్త ప్రైవసీ మార్పులు, పెరిగిన పోటీ గురించి ప్రస్తావిస్తూ భవిష్యత్తుపై ఆందళనకర స్టేట్మెంట్ విడుదల చేసిందీ కంపెనీ. ఆ వెంటనే ఇలా రికార్డు స్థాయిలో కంపెనీ షేర్లు పడిపోయాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

