దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా భారత్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది.
లావా Z2 సిరీస్‌లో Z2 మాక్స్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. లావా జెడ్ 2 మాక్స్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ చిప్సెట్, డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. మీడియాటెక్ SoC, 4G VoLTE సపోర్ట్‌తో వస్తుంది. ఇ-లెర్నింగ్ లక్ష్యంగా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సహాయం చేయడానికి పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీతో విడుదల చేసింది. లావా జెడ్ 2 మాక్స్‌ను లావా వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. భారత్‌లో జెడ్ 2 మాక్స్ ఫోన్ 2GB / 32GB వేరియంట్ ధర రూ.7,799గా నిర్ణయించారు. ఈ ఫోన్ స్ట్రోక్డ్ బ్లూ, స్ట్రోక్డ్ సియాన్ కలర్లలో అందుబాటులో ఉంది.
Lava Z2 Max స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 7 అంగుళాలు
ప్రాసెసర్: క్వాడ్ కోర్
ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సల్
రియర్ కెమెరా: 13+2 మెగా పిక్సల్
ర్యామ్: 2జీబీ
స్టోరేజ్: 32జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 6000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 10