JioPhone 5G | గత సంవత్సరం జియో నుంచి జియోఫోన్ నెక్స్ట్ విడుదలైన విషయం తెలిసిందే. జియోఫోన్ నెక్స్ట్.. జియో నుంచి విడుదలైన తొలి స్మార్ట్ఫోన్. అలాగే ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ఫోన్. జియో ఫోన్ నెక్స్ట్కు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో జియో.. త్వరలో 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
జియో ఫోన్ 5జీని త్వరలో జియో లాంచ్ చేయనున్న నేపథ్యంలో దాని ఫీచర్లు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 ఎస్వోసీ, 4 జీబీ ర్యామ్, డ్యుయల్ కెమెరా సెటప్, 13 ఎంపీ మెయిన్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరా, 8 ఎంపీ సెన్సార్, 32 జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 5జీ, 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, డేటా ట్రాన్స్ఫర్, చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్ సీ, ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్), గూగుల్ అసిస్టెంట్, ఇన్స్టంట్ ట్రాన్స్లేషన్ లాంటి ఫీచర్లతో జియోఫోన్ 5జీ రాబోతున్నట్టు తెలుస్తోంది.
జియోఫోన్ 5జీని బడ్జెట్ ధరలోనే అందించేందుకు రిలయెన్స్ జియో ప్లాన్ చేస్తోంది. దాని ధర రూ.9000 నుంచి రూ.12000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డబ్బును ఒకేసారి కాకుండా ఫైనాన్స్ ఆప్షన్ ద్వారా ఈఎంఐ పద్ధతిలోనూ చెల్లించవచ్చు.