టెకీల్లో లేఆఫ్స్ గుబులు : సేల్స్‌ఫోర్స్‌లో మళ్లీ కొలువుల కోత
ఈ ఏడాది ఆరంభం నుంచి ఐటీ కంపెనీల్లో కొలువుల కోత టెకీలను వణికిస్తోంది. 2022లో ఇప్పటివరకూ 1,80,000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇంత జరిగినా లేఆఫ్స్ ప్రకంపనలకు తెరపడటం లేదు.
న్యూయార్క్ : ఈ ఏడాది ఆరంభం నుంచి ఐటీ కంపెనీల్లో కొలువుల కోత టెకీలను వణికిస్తోంది. 2022లో ఇప్పటివరకూ 1,80,000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇంత జరిగినా లేఆఫ్స్ ప్రకంపనలకు తెరపడటం లేదు. అమెరికన్ ఐటీ సంస్ధ సేల్స్‌ఫోర్స్ మరో దశ లేఆఫ్స్‌కు సన్నాహాలు చేపట్టడంతో టెకీల్లో గుబులు రేగింది.
నాయకత్వ స్ధానాల్లో మార్పులు, సేల్స్ టార్గెట్లను చేరుకోవడంపై ఒత్తిళ్లు, ఇన్వెస్టర్ల ప్రభావంతో మరో విడత లేఆఫ్స్ తప్పవనే సంకేతాలు వెల్లడయ్యాయి. ఏ క్షణంలోనైనా లేఆఫ్స్ బాంబు పేలవచ్చని ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్ధిక అనిశ్చితి కారణంగా వ్యయ నియంత్రణ చర్యలపై కంపెనీ దృష్టి సారించిందనే వార్తలు వచ్చాయి.
మెటా, అమెజాన్, ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు లేఆఫ్స్‌కు తెగబడిన నవంబర్‌లో సేల్స్‌ఫోర్స్ సైతం వందలాది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా సేల్స్‌ఫోర్స్‌లో 73,000 మందికి పైగా ఉద్యోగులు ఉండగా ఆర్ధిక అననుకూల పరిస్ధితులు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా సిబ్బంది సంఖ్యను కుదించేందుకు సేల్స్‌ఫోర్స్ కసరత్తు సాగిస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- IT firm
- layoffs
- Salesforce
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

