iQOO Z10 Lite 5G | భారీ బ్యాటరీ, ఆకట్టుకునే ఫీచర్లతో తక్కువ ధరకే ఐక్యూ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్..!
తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందించడంలో కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలోనే మిడ్ రేంజ్ ఫోన్ల లాంటి ఫీచర్లను అందిస్తున్నారు.
iQOO Z10 Lite 5G | తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందించడంలో కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలోనే మిడ్ రేంజ్ ఫోన్ల లాంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఇక బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వచ్చే విధంగా ఫీచర్లను అందిస్తున్నారు. అందులో భాగంగానే ఐక్యూ లేటెస్ట్గా జడ్10 లైట్ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీకి చెందిన బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ కావడం విశేషం. ఇందులో 6.74 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. కనుక డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ముందు వైపు నాచ్ భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్లో మీడియాటెక్‌కు చెందిన డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండగా 8జీబీ వరకు ర్యామ్‌ను అందిస్తున్నారు. మరో 8జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. ఈ ఫోన్లో వినియోగదారులకు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఇందుకు గాను 2 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాలు రెండింటిని ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్‌కు పక్క భాగంలో ఇచ్చారు. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీన్ని ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ బ్యాటరీ 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్..
4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఐపీ64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు.
ధర వివరాలు..
ఐక్యూ జడ్ 10 లైట్ 5జి స్మార్ట్ ఫోన్‌ను టైటానియం బ్లూ, సైబర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.12,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు ఐక్యూ ఇండియా ఇ-స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. జూన్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్‌ను విక్రయిస్తారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

