iPhone SE (2022) | ఐఫోన్ ఎస్ఈ ప్లస్ 5జీగా రానున్న ఐఫోన్ ఎస్ఈ 2022.. లాంచ్ ఎప్పుడంటే?
iPhone SE (2022) | అది ఏ మోడల్ ఫోన్ అయినా సరే.. ఏ వర్షన్ ఫోన్ అయినా సరే.. యాపిల్ ఫోన్ అంటేనే అదో క్రేజ్. ఐఫోన్ చేతుల్లో ఉంటే చాలు.. అదో తృప్తి. ఐఫోన్ కొనాలనేది.. తమ జేబుల్లో ఐఫోన్ ఉండాలనేది చాలామంది యూత్ కనే కల. ఐఫోన్లో ఉండే ఫీచర్లతో పాటు.. చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉండే ఐఫోన్ అంటే ఎవరికి మాత్రం నచ్చదు చెప్పండి. ఇప్పటికే ఐఫోన్ 13 మోడల్ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. త్వరలో ఐఫోన్ 14 కూడా రాబోతోంది. అయితే.. సామాన్యులకు కూడా ఐఫోన్ అందుబాటులో ఉండేందుకు.. ఎస్ఈ మోడల్ ఫోన్‌ను యాపిల్ సంస్థ తీసుకొచ్చింది.

ఐఫోన్ ఎస్ఈలో 2020 లేటెస్ట్ మోడల్ ఫోన్. త్వరలోనే ఐఫోన్ ఎస్ఈ 2022 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. అయితే.. దాన్ని ఐఫోన్ ఎస్ఈ ప్లస్ 5జీ ఫోన్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఐఫోన్ ఎస్ఈ ప్లస్ 5జీతో పాటు ఫిప్త్ జనరేషన్ ఐపాడ్ ఎయిర్‌ను కూడా త్వరలో జరగబోయే స్ప్రింగ్ ఈవెంట్లో లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఫోన్‌ను 2016లో యాపిల్ లాంచ్ చేసింది. ఆ తర్వాత ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్‌ను రిలీజ్ చేసింది. త్వరలో ఐఫోన్ ఎస్ఈ 2022 విడుదల కానుంది. ఐఫోన్ ఎస్ఈ 2022లో 4.7 ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, ఏ15 బయోనిక్ ఎస్వోసీ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 12 ఎంపీ బ్యాక్ కెమెరా లాంటి ఫీచర్లు ఉండనున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

