iPhone | 2025లో లేటెస్ట్ ఫీచర్లతో ఐఫోన్ ఫోల్డ్ గ్రాండ్ ఎంట్రీ
ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో పాలు పలు న్యూ ఫీచర్లతో ఐఫోన్ ఫోల్డ్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించనుంది.
న్యూఢిల్లీ : వినియోగదారులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ 2025లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో పాలు పలు న్యూ ఫీచర్లతో ఐఫోన్ ఫోల్డ్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించనుంది. ప్రస్తుతం ఫోల్డబుల్ మార్కెట్లో శాంసంగ్ దీటుగా రాణిస్తుండగా మొటొరొలా సైతం పలు ఫోల్డబుల్ ఫోన్లను లాంఛ్ చేయగా 2023లో రేజర్‌ను ప్రవేశపెట్టనుంది.
మరోవైపు గూగుల్ పిక్సెల్ సైతం త్వరలోనే మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెడుతోంది. ఇక యాపిల్ ఐఫోన్ ఫోల్డ్ 2025లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్‌ను పోలిన డిజైన్‌పై యాపిల్ కసరత్తు సాగిస్తోందని సమాచారం. యాపిల్ ప్రస్తుతం డివైజ్ మన్నికను పరీక్షిస్తోంది.
ఇక ఫోల్డింగ్ ఐఫోన్‌కు ఓఎల్ఈడీ వాడాలా లేక మైక్రోలెడ్ మెటీరియల్‌ను ఉపయోగించాలా అని యాపిల్ యోచిస్తోందని ఎకనమిక్ డైలీ పేర్కొంది. ఫోల్డబుల్ ఫోన్లు ఊపందుకున్నా ఈ మార్కెట్లో ప్రస్తుతం శాంసంగ్, మొటొరొలా, ఎల్జీ, హువై వంటి కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. యాపిల్ ఫోల్డ్ కూడా ఈ సెగ్మెంట్లో ఎంటరైతే పోటీ నెలకొనడం ద్వారా ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

