IPhone | మాస్క్ వేసుకున్నా ఫేస్‌లాక్ ఓపెన్.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన యాపిల్
మొబైల్ టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ఒకడుగు ముందుండే యాపిల్ సంస్థ.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో అందరూ మాస్కులు ధరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ ఐఫోన్లలో ఫేస్ లాక్ పెట్టుకున్న వారు.. లాక్ తీసేందుకు మాస్కు తీయాల్సి వస్తోంది.
ఇకపై ఇలాంటి సమస్య లేకుండా మాస్కు ధరించినా కూడా ఫేస్ లాక్ ఓపెన్ అయ్యేలా యాపిల్ ఒక ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో ఉన్న ఐఓఎస్ 15.4 అప్డేట్ను తాజాగా విడుదల చేసింది. ఇది ఐఫోన్ 12, 13 సిరీసుల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
కళ్ల చుట్టూ ఉంటే ప్రత్యేక లక్షణాలను ఈ ఫీచర్ స్కాన్ చేస్తుందని, తద్వారా ఆథెంటికేట్ చేసి మాస్కు ఉన్న కూడా లాక్ ఓపెన్ చేస్తుందని వివరించింది. ఈ కొత్త అప్డేట్లో ఈ కొత్త ఫీచర్‌తోపాటు ఎయిర్‌ట్యాగ్ సెటప్ సమయంలో సేఫ్టీ మెసేజ్‌లు కూడా అందుబాటులో ఉంటాయని సమాచారం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple
- iOS
- IPhone
- new feature
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

