iPhone 15 | ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్, 16 ప్రొ మ్యాక్స్ డిజైన్, డిస్ప్లే వివరాలు లీక్
యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన లేటెస్ట్ ఐఫోన్ 15 (iPhone 15 ) సిరీస్‌ను లాంఛ్ చేస్తుండగా లాంఛ్ ఈవెంట్‌కు ముందు అప్‌కమింగ్ ఐఫోన్లకు సంబంధించిన లీక్స్‌కు బ్రేక్ పడటం లేదు.
న్యూఢిల్లీ : యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన లేటెస్ట్ ఐఫోన్ 15 (iPhone 15 ) సిరీస్‌ను లాంఛ్ చేస్తుండగా లాంఛ్ ఈవెంట్‌కు ముందు అప్‌కమింగ్ ఐఫోన్లకు సంబంధించిన లీక్స్‌కు బ్రేక్ పడటం లేదు. యాపిల్ తన 2023 ఐఫోన్లను రీడిజైన్ చేస్తుందనే ప్రచారంతో గత కొంతకాలంగా ఐఫోన్ 15 సిరీస్ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఐఫోన్ 15 ప్రొ, 16 ప్రొ మ్యాక్స్ మోడల్స్ డిస్ప్లే వివరాలు, ఫ్రంట్ డిజైన్‌పై ఆన్లైన్లో లీక్స్ సందడి చేస్తున్నాయి.
ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ పాత డిస్ప్లే సైజ్‌తో రానుండగా ముందు భాగం డిజైన్ కూడా గత ఏడాది మోడల్‌నే పోలి ఉంటుందని లీక్స్‌లో వెల్లడైంది. ఐఫోన్ 14 ప్రొ మోడల్స్‌లో చూసిన డైనమిక్ ఐలండ్ డిజైన్‌ను అప్‌కమింగ్ ఫోన్లలోనూ ఆఫర్ చేయనుంది. ఐఫోన్ 15 సిరీస్‌లో బేసిక్ మోడల్స్‌లోనూ డైనమిక్ ఐలండ్ డిజైన్ ఫీచర్ ఉంటుందని చెబుతున్నారు. 9టూ5మ్యాక్ తెలిపిన వివరాల ప్రకారం ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ 6.7 ఇంచ్ స్క్రీన్‌తో ముందు భాగంలో డ్యూయల్ పంచ్ హోల్ డిజైన్‌తో ఆకట్టుకోనుంది.
ఇక ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ 6.9 ఇంచ్‌తో భారీ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకొస్తుందని లేటెస్ట్ లీక్‌లో వెల్లడైంది. ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ 159.8ఎంఎం పొడవుతో రానుండగా 16 ప్రొ మ్యాక్స్ 165ఎంఎం పొడవు ఉంటుందని లీక్స్ తెలిపాయి. ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ ఐఓఎస్ 17పై రన్ అవుతుందని, బయోనిక్ ఏ17 చిప్సెట్తో ముందుకొస్తుందని చెబుతున్నారు. ఐఫోన్ 15 సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్ 5x జూమ్ సామర్ధ్యాలతో పెరిస్కోప్ జూమ్ లెన్స్‌తో కస్టమర్ల ముందుకురానుంది.
Read More
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

