న్యూఢిల్లీ : యాపిల్ కొద్దినెలల కిందట ఐఫోన్ 14ను లాంఛ్ చేసినా ఐఫోన్ 13తో పోలిస్తే భారీ అప్గ్రేడ్లు లేకపోవడంతో కొనుగోలుదారులు న్యూ డివైజ్‌పై పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అక్కడక్కడా కొద్దిపాటి మార్పులు మినహా ఫీచర్లు, డిజైన్ పరంగా ఐఫోన్ 13, ఐఫోన్ 14 దాదాపు ఒకే రకంగా ఉన్నాయి.
రెండు ప్రీమియం మోడల్స్ ఒకే తరహాలో ఉండటంతో ఐఫోన్ 14కు మారాలనే వినియోగదారులు ఐఫోన్ 15 ఎంట్రీ ఇచ్చే వరకూ వేచిచూడాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది లాంఛ్ కానున్న ఐఫోన్ 15లో యాపిల్ భారీ అప్గ్రేడ్లు చేపట్టనుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. రానున్న ఐఫోన్ 15 న్యూ బయోనిక్ ఏ17 బయోనిక్ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది.
ఐఫోన్ 15 మోడల్స్‌లో పెరిస్కోప్ లెన్స్ వాడేందుకు యాపిల్ సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రస్తుత ఐఫోన్ 14 ప్రొ మోడల్స్‌లో 3x ఆప్టికల్ జూమ్ ఆఫర్ చేస్తుండగా, పెరిస్కోప్ లెన్స్‌తో 5x లేదా 10x ఆప్టికల్ జూమ్‌ను యాపిల్ ఆఫర్ చేయనుంది. ఐఫోన్ 15లో మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందించేందుకు కంపెనీ కసరత్తు
సాగిస్తోందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.