I-Phone 14 | బుక్ చేసిన 30 నిమిషాల్లో మీ అరచేతిలో ఐ-ఫోన్14.. అందుకేం చేయాలంటే?!
I-Phone 14 | జొమాటో బ్లింకిట్ యాప్ ద్వారా బుక్ చేస్తే కేవలం 30 నిమిషాల్లో కొత్త ఐ-ఫోన్ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది.
I-Phone 14 | మీరు ఆపిల్ కొత్త `ఐ-ఫోన్` కొనుక్కోవాలని భావిస్తున్నారా.. ఐ-ఫోన్ కోసం మీరు ఇక ఎంత మాత్రం క్యూ లైన్లలో నిలబడనవసరం లేదు. కొన్ని గంటల పాటు వెయిట్ చేయనవసరం లేదు. మీరు బుక్ చేసిన అర్థగంట లోపే మీ చేతిలో ఐఫోన్ ఉంటుంది. ఇంతకుముందు ఆర్డర్ చేసిన అర్థ గంటలోనే ఫుడ్ డెలివరీ చేసే ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో సబ్ బ్రాండ్ బ్లింకిట్ ఆపిల్ ఐ-ఫోన్14 ఫోన్ డెలివరీ చేయడానికి ముందుకు వచ్చింది.
ఇందుకు ఆపిల్ రీసెల్లర్ యూనికార్న్ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. సకాలంలో కస్టమర్లకు కొత్త ఐఫోన్ డెలివరీ చేయనున్నది. ప్రస్తుతం ఐ-ఫోన్ 14, ఐ-ఫోన్ 14 ప్రో ఫోన్లు ఇప్పుడు యూజర్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆపిల్ ఆథరైజ్డ్ రిటైల్ ఔట్లెట్లు, ఆపిల్ ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు.
ఈ విషయాన్ని బ్లింకిట్ ఫౌండర్ అల్బిందర్ ధిండ్సా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. `మేం ఆపిల్ ఫోన్ రీసెల్లర్ యూనికార్న్‌తో భాగస్వాములం అయ్యాం. బ్లింకిట్ కస్టమర్లకు ఆపిల్ ఐ-ఫోన్, దాని విడి భాగాలు ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే డెలివరీ చేస్తాం. ఢిల్లీ, ముంబై నగరాల్లో మాత్రం ప్రస్తతం ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి` అని ట్వీట్ చేశారు. అయితే, ఇతర నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయా.. లేదా.. అన్న సంగతి వెల్లడించలేదు.
బ్లింకిట్ ద్వారా ఐ-ఫోన్ కోసం ఆర్డర్ చేసేవారు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి బ్లింకిట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అటుపై ఐ-ఫోన్ కోసం ఆర్డర్ చేస్తే సరి. 128 జీబీ రామ్ సామర్థ్యం గల ఐ-ఫోన్ 14 రూ.79,900, 256 జీబీ రామ్ వేరియంట్ రూ.89,900, 512 జీబీ వేరియంట్ రూ.1,09,900లకు లభ్యం అవుతున్నాయి. మరోవైపు ఐఫోన్ 14 ప్రో 128 జీబీ వేరియంట్ ధర రూ.1,29,900, 256 జీబీ ఫోన్ ధర రూ.1,39,900, 512 జీబీ వేరియంట్ ధర రూ.1,59,900, ఒక టిగా బైట్ రామ్ గల ఐ-ఫోన్ ధర రూ.1,79,900 పలుకుతున్నాయి.
ఒకవేళ మీరు ఆపిల్ స్టోర్ నుంచి హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఐఫోన్ కొనుగోలు చేస్తే రూ.6000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందొచ్చు. బేస్ వేరియంట్ ఐ-ఫోన్ 14 ఫోన్ ధర రూ.73,900లకు లభిస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple
- Blinkit
- I phone
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

