iPhone 13 | క్రోమాలో ఐఫోన్ 13పై రూ . 4000 ఆఫర్
ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాల నుంచి రిటైల్ స్టోర్స్ సైతం ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.
న్యూఢిల్లీ : ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాల నుంచి రిటైల్ స్టోర్స్ సైతం ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. క్రోమా ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్టోర్స్‌లో ఐఫోన్ 13పై రూ 4000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 13తో పాటు ఐఫోన్ 2, మ్యాక్‌బుక్ ఎయిర్ సహా ఇతర యాపిల్ ఉత్పత్తులపై క్రోమాలో డిస్కౌంట్ లభిస్తోంది.
ఐఫోన్ 13 క్రోమా వెబ్సైట్లో 128జీబీ వేరియంట్ రూ 71,990కి లిస్టయింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు రూ 4000 ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక అమెజాన్‌లో ఐఫోన్ 13 రూ 68,900కి లిస్టవగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ 12,700 వరకూ లభిస్తోంది. అయితే పాత ఫోన్ మోడల్, కండిషన్‌ను బట్టి ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ ఆధారపడిఉంటుంది.
ఇక ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్ చూస్తే..6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఏ15 బయోనిక్ 5ఎన్ఎం హెక్సా-కోర్ ప్రాసెసర్‌తో 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఓఎస్ 15 అవుట్‌సైడ్ ఆఫ్ ది బాక్స్‌పై రన్ అవుతుంది. ఐఫోన్ 13 20డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 3240ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన కెమెరా ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

