iPhone 12 | ఎన్ని జనరేషన్లు మారినా.. ఎన్ని స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చినా.. యాపిల్‌కు ఉన్న క్రేజే వేరు. యాపిల్ ఫోన్లకు ఉన్న డిమాండే వేరు. గత సంవత్సరం ఐఫోన్ 13ను మార్కెట్లోకి తీసుకొచ్చిన యాపిల్.. కంపెనీ మార్కెట్ వాల్యూను కూడా అమాంతం పెంచేసుకుంది. ఐఫోన్ చేతుల్లో ఉంటే చాలు.. అని ప్రతి ఒక్కరు ఆశపడుతుంటారు. అటువంటి వాళ్ల కోసం ఈ కామర్స్ సంస్థలు.. కొన్ని యాపిల్ ఫోన్లకు స్పెషల్ డిస్కౌంట్లతో అందిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈకామర్స్ వెబ్సైట్లలో ఐఫోన్ 12 సిరీస్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ.. ఫోన్ల మీద రూ.10 వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఐఫోన్ 12 ప్రస్తుత ధర రూ.63900 ఉంది. కానీ.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12ను రూ.53,999కే అందిస్తున్నారు. దాని రిటైల్ ధర బయట రూ.65,900 ఉంది. అయితే.. ఐఫోన్ 13 మార్కెట్లోకి రాగానే.. ఐఫోన్ 12 ధరలను యాపిల్ సంస్థ అమాంతం తగ్గించేసింది.
64 జీబీ వేరియంట్ ఐఫోన్ 12 మోడల్ ఫోన్‌ను రూ.53,999కి అందిస్తుండగా.. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ఫోన్‌ను రూ.64,999కే అందిస్తున్నారు. దీని వాస్తవ ధర రూ.70,900. ఐఫోన్ 12 మినీ 64 జీబీ వేరియంట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్టులో రూ.40,999 కే అందిస్తున్నారు. అమెజాన్‌లో ఐఫోన్ 12 మినీ ధర రూ.53,900గా ఉంది. ఐఫోన్ 12 మినీ 128 జీబీ వేరియంట్ ఫోన్‌ను రూ.54,999 కే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. దాని వాస్తవ ధర రూ.64,900గా ఉంది.
ఐఫోన్ 12, 12 మినీ ఫోన్లలో.. యాపిల్ ఏ14 బయోనిక్ చిప్, 5జీ, 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 12.. 6.1 ఇంచ్ స్క్రీన్, ఐఫోన్ 12 మినీ.. 5.4 ఇంచ్ డిస్ప్లేను కలిగి ఉంటాయి.