IPhone 12 | అమెజాన్ ప్రైమ్ సేల్‌లో ఐఫోన్ 12పై భారీ ఆఫర్లు
ఐఫోన్ అభిమానులు తమ డ్రీమ్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ మెరుగైన అవకాశంగా ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ : ఐఫోన్ అభిమానులు తమ డ్రీమ్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ మెరుగైన అవకాశంగా ముందుకొచ్చింది. సేల్ పిరియడ్‌లో ఐఫోన్ 12, ఐఫోన్ 13 బ్యాంక్ ఆఫర్లతో అతితక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 12 64జీబీ వేరియంట్ రూ 54,990కి, 128జీబీ రూ 59,999కి లభిస్తుండగా బ్యాంక్ ఆఫర్లతో రూ 50,391కే హాట్ డివైజ్‌ను సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది.
వీటిపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందే అవకాశం ఉంది. అమెజాన్ 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుండగా, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్లు వర్తించిన మీదట రూ 50,391కే ఐఫోన్ 12 లభిస్తోంది. ఇక ఐఫోన్ 12 ఫ్లిప్‌కార్ట్‌లో రూ 51,999కి అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ధరలు దాదాపు ఒకేరకంగా ఉన్నాయి.
ఇక ఐఫోన్ 12 ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ నెక్ట్స్ జనరేషన్ న్యూరల్ ఇంజిన్ ప్రాసెసర్‌తో కూడిన ఏ14 బయోనిక్ చిప్‌ను కలిగిఉంది. 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేతో పాటు ముందు భాగంలో నైట్ మోడ్‌తో 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా, 4కే డోల్బీ విజన్ హెచ్డీఆర్ రికార్డింగ్, ప్రొటెక్షన్ కోసం ఐఫోన్ 12 సిరామిక్ షీల్డ్ కోటింగ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

