IPhone 12 | ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ 52,999కే ఐఫోన్ 12 సొంతం!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేలో భారీ డిస్కౌంట్లు ఆఫర్లో ఉండగా ఐఫోన్ 12 స్మార్ట్‌పోన్‌ను సొంతం చేసుకునేందుకు ఇదే సరైన అవకాశంగా ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేలో భారీ డిస్కౌంట్లు ఆఫర్లో ఉండగా ఐఫోన్ 12 స్మార్ట్‌పోన్‌ను సొంతం చేసుకునేందుకు ఇదే సరైన అవకాశంగా ముందుకొచ్చింది. సిటీ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ కార్డుదారులకు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 12 అతితక్కువగా రూ 52,999కే అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 64జీబీ వేరియంట్ గతంలో రూ 65,999కి లిస్టయింది. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ ధర రూ 52,999కి తగ్గింది.
ఫ్లిప్‌కార్ట్ మరో రూ 1000 అదనంగా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీనికి తోడు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయదలుచుకున్న వారికి ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇక నాన్ ప్లస్ మెంబర్‌కు ఐఫోన్ 12 ప్రస్తుతం రూ 59,999కి లిస్టవగా యాక్సిస్ బ్యాంక్ కార్డు ఆఫర్‌తో ఇది రూ 56,999కి లభిస్తుంది. దీనికి ఎక్స్ఛేంజ్ ఆఫర్ అదనంగా అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్ డీల్స్‌లో ఐఫోన్ 12 రూ 52,000కే లభిస్తుండటంతో మెరుగైన ఐఓఎస్ ఫోన్ రీజనబుల్ రేట్లో సొంతం చేసుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 12 నెక్ట్స్ జనరేషన్ న్యూరల్ ఇంజిన్ ప్రాసెసర్‌తో కూడిన ఏ14 బయోనిక్ చిప్‌ను కలిగిఉంది. 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేతో పాటు ముందు భాగంలో నైట్ మోడ్‌తో 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా, 4కే డోల్బీ విజన్ హెచ్డీఆర్ రికార్డింగ్, ప్రొటెక్షన్ కోసం ఐఫోన్ 12 సిరామిక్ షీల్డ్ కోటింగ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

