Infinix Note 12i | దేశీయ మార్కెట్లోకి ఇన్ఫినిటీ నోట్ 12ఐ.. బడ్జెట్ క్యాటగిరీలోనే..!
Infinix Note 12i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. భారత్ మార్కెట్లోకి నోట్ 12ఐ ఫోన్ తెచ్చింది. ఇది బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటుంది.
Infinix Note 12i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ `ఇన్ఫినిక్స్` దేశీయ మార్కెట్లోకి చౌకగా గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ ( Infinix Note 12i ) తీసుకొచ్చింది. మీడియా టెక్ హీలియో జీ85 ఆల్ట్రా గేమింగ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తున్నది. 10-లేయర్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ ఫోన్ బడ్జెట్ క్యాటగిరీలోనే లభ్యం అవుతుంది. ఇన్ఫినిక్స్ నోట్ ( Infinix Note 12i ) ఫోన్.. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ మెమొరీతో వస్తుంది. దీని ధర రూ.12,999 మాత్రమే. జనవరి 30 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభ్యం అవుతుంది.
- ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ గేమింగ్ ఫోన్ బయ్యర్లకు రూ.9999లకే లభ్యం.
- జియో ఫోన్ యూజర్‌కు ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద రూ.1000 క్యాష్‌బ్యాక్ ఆఫర్.
ఇవీ ఫోన్ స్పెషిపికేషన్స్..
- ఫోర్స్ బ్లాక్, మెటావర్స్ బ్లూ, అప్‌లైన్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం.
- 6.8-అంగుళాల టీఎఫ్టీ-ఎల్సీడీ డిస్ప్లే విత్ స్క్రీన్ ఫుల్ హెచ్డీ+ (720 × 1640 పిక్సెల్స్) రిజొల్యూషన్.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ఫోన్ ప్రొటెక్షన్. - సెల్ఫీ సెన్సర్ కోసం డిస్ప్లేపై వాటర్‌డ్రాప్ నాచ్.
- ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎక్స్ఓఎస్12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
- మీడియా టెక్ హెలియో జీ85 ప్రాసెసర్.
- గ్రాఫిక్స్ కోసం మాలీ జీ52 లభ్యం.
- 4జీబీ విత్ 64 ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ.. మైక్రో ఎస్డీకార్డ్ సాయంతో 512 జీబీ వరకు స్టోరేజీ సామర్థ్యం పెంపు.
- ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ లభ్యం.
- 50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 2 మెగా పిక్సెల్ డెప్త్, క్యూవీజీఏ ఏఐ లెన్స్ అండ్ ఎల్ఈడీ ఫ్లాష్, ఫ్రంట్‌లో 8-మెగా పిక్సెల్ కెమెరా లభ్యం.
- 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు చార్జింగ్ కోసం 33 వాట్ల ఫాస్ట్ చార్జర్.
- డేటా ట్రాన్స్ఫర్, చార్జింగ్ కోసం టైప్-సీ పోర్ట్.
- ఫోన్ సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్.
- డీటీఎస్ ఆడియో సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్ సెటప్.
- 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ తదితర కనెక్ట్విటీ ఫీచర్లు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

