Infinix GT 30 5G Plus | అదిరిపోయే డిస్ప్లే, భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..?
ఇన్ఫినిక్స్ సంస్థ మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. జీటీ30 5జి ప్లస్ పేరిట ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది.
Infinix GT 30 5G Plus | ఇన్ఫినిక్స్ సంస్థ మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. జీటీ30 5జి ప్లస్ పేరిట ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందించడమే కాదు, దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్లో 6.78 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి 1.5కె రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 8 జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే సదుపాయం కల్పించారు.
సులభంగా గేమ్స్ ఆడుకోవచ్చు..
ఈ ఫోన్లో 6 లేయర్ వీసీ కూలింగ్ టెక్నాలజీని అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురి కాదు. ఇక క్రాఫ్టన్‌కు చెందిన బీజీఎంఐ వంటి గేమ్స్‌ను 90 ఎఫ్‌పీఎస్‌తో ఆడుకోవచ్చు. దీని వల్ల డివైస్ మెరుగైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్‌కు గాను ప్రత్యేకంగా షోల్డర్ ట్రిగ్గర్స్‌ను అందిస్తున్నారు. దీని వల్ల బీజీఎంఐ లాంటి గేమ్స్‌ను సులభంగా ఆడుకోవచ్చు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఎక్స్ ఓఎస్ 15 లభిస్తుంది. ఫ్లోటింగ్ విండో, డైనమిక్ బార్, గేమ్ మోడ్, కిడ్స్ మోడ్, పీక్ ప్రూఫ్ వంటి ఫీచర్లను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఈ ఫోన్లో ఫోలాక్స్ పేరిట స్మార్ట్ అసిస్టెంట్ కూడా ఉంది. దీని సహాయంతో వాతావరణ అప్డేట్స్, కెమెరా కంట్రోల్, చాట్స్ వంటి సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు.
భారీ బ్యాటరీ, 2 ఏళ్ల వరకు అప్డేట్స్..
ఈ ఫోన్‌కు గాను 2 ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌ను సైబర్ మెకా డిజైన్‌తో రూపొందించారు. దీనికి గాను కస్టమైజ్ చేసుకునే విధంగా తెలుపు రంగు ఎల్ఈడీ లైట్స్‌ను ఇస్తున్నారు. పల్స్ గ్రీన్, సైబర్ బ్లూ కలర్స్‌లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను సైతం ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు.
ధర వివరాలు..
ఇన్ఫినిక్స్ జీటీ 30 5జి ప్లస్ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తోపాటు ఇన్ఫ్రా రెడ్ సెన్సార్ కూడా ఉంది. దీని వల్ల ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్‌గా కూడా వాడుకోవచ్చు. ఈ ఫోన్‌కు ఐపీ64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ సదుపాయాన్ని అందిస్తున్నారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5.4 వంటి అదనపు ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,499 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 14 నుంచి విక్రయిస్తారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో రూ.1500 తగ్గింపు ధరను అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే అదనంగా మరో రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

