Uttarakhand Bhookamp Alert : భూకంపాన్ని ముందే పసిగట్టే మొబైల్ యాప్ వచ్చేసింది
భూకంపం అనేది ప్రకృతి విపత్తు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. భూకంపం ఒక్కసారి వచ్చిందంటే.. తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. అందుకే.. భూకంపం అంటేనే ప్రజలు హడలిపోతారు.

అయితే.. భూకంపాన్ని ముందే గుర్తించలేమా? పలానా ఏరియాలో భూకంపం వస్తుందని ముందే పసిగట్టలేమా? అంటే.. ఇప్పుడు అవును అనే చెప్పొచ్చు. నిజానికి.. భూకంపాన్ని ముందే గుర్తించే విషయంపై చాలా రీసెర్ఛ్లు జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఐఐటీ రూర్కీ… భూకంపాన్ని ముందే గుర్తించే మొబైల్ యాప్‌ను డెవలప్ చేసింది.
ఉత్తరాఖండ్ భూకంప్ అలర్ట్ అనే పేరు డెవలప్ చేసిన ఈ యాప్‌ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ తాజాగా లాంచ్ చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా భూకంపాలు వస్తున్నందున్న.. భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతం అవడం వల్ల.. భూకంపాలను ముందే గుర్తించి.. సహాయక చర్యలను ముందే ప్రారంభించే ఉద్దేశంతోనే ఈ యాప్‌ను అభివృద్ధి చేయించామని ముఖ్యమంత్రి పుష్కర్ వెల్లడించారు.

ఈ యాప్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పాన్సర్ చేసింది.
భూకంపాల గురించి ముందే అలర్ట్ ఇచ్చేలా ఇప్పటి వరకు ఎటువంటి టెక్నాలజీ రాలేదు. మొట్టమొదటిసారిగా వచ్చిన యాప్ ఇదే. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న వాళ్లకు ఎర్త్‌క్వేక్ ఎర్లీ వార్నింగ్ పేరుతో రియల్ టైమ్ ఎర్త్‌క్వేక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల రూపంలో అందిస్తారు. సీస్మిక్ వేవ్స్ వేగం ఆధారంగా ముందే.. ఏ ప్రాంతంలో భూకంపం వస్తుందో ఈ యాప్ పసిగడుతుంది. దీంతో వెంటనే ప్రజలు అప్రమత్తమై ఆ చోటును వదిలి దూరంగా వెళ్లి ప్రాణాలను కాపాడుకోవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

