AI Pin | అరచేతినే స్మార్ట్‌ఫోన్‌గా మార్చనున్న ఏఐ పిన్ : అద్భుత డివైజ్ ఆవిష్కరణకు హ్యుమనె సన్నాహాలు
డిస్ప్లే లేకుండా స్మార్ట్‌ఫోన్‌లా పనిచేసే ఈ వండర్ ఏఐ పిన్ను (AI Pin) హ్యుమనె కంపెనీ త్వరలో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది.
న్యూయార్క్ : మీ షర్ట్‌కు లేదా జాకెట్‌కు చిన్న ల్యాపెల్ పిన్ లేదా క్లిప్ ధరించి ఎన్నో పనులు చక్కబెట్టే రోజులు రానున్నాయి. ఈ విషయం నమ్మలేకున్నా సాధ్యమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. డిస్ప్లే లేకుండా స్మార్ట్‌ఫోన్‌లా పనిచేసే ఈ వండర్ ఏఐ పిన్ను (AI Pin) హ్యుమనె కంపెనీ లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. సబ్స్క్రిప్షన్ ఆధారంగా అందుబాటులోకి రానున్న ఈ ఏఐ పిన్ బింగ్, చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్‌తో పనిచేస్తుంది.
స్మార్ట్‌ఫోన్స్ తర్వాతి దశపై ఏఐ కంపెనీ హ్యూమనె చాలా కాలంగా కసరత్తు సాగిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లా వ్యవహరిస్తూ అన్ని పనులను చక్కబెట్టే డిస్ప్లే రహిత గాడ్జెట్ గురించి హ్యూమనె ఎప్పటినుంచో మాట్లాడుతోంది. అయితే సంప్రదాయ స్మార్ట్‌ఫోన్ స్పేస్‌ను ఇది భర్తీ చేయదని చెబుతున్నారు. ఇక ఏఐ పిన్ను షర్ట్‌కు క్లిప్ చేయవచ్చు. డెస్క్ వద్ద పనిచేసుకునే సమయంలో టేబుల్‌పై ఉంచవచ్చు.
ఏఐ పిన్‌లో ఉండే గ్రీన్ లేజర్ ఇన్ఫర్మేషన్ను మీ అరచేతిపై చూపుతుంది. అరచేతిని ట్యాప్ చేస్తూ కాల్స్ చేయడంతో పాటు మెసేజ్‌లు టైప్ చేయవచ్చు. మీ అరచేతినే ఏఐ పిన్ స్మార్ట్‌ఫోన్‌గా మార్చేస్తుంది. ఏఐ పిన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు కెమెరా, డెప్త్, మోషన్ సెన్సర్స్, బిల్టిన్ స్పీకర్‌ను కలిగిఉంటుంది. ఇక బ్యాటరీలను చార్జి చేయడం, మార్చడం ద్వారా పూర్తి డివైజ్‌కు చార్జింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
Read More :
Cyber Fraud | వ్యాపారం పేరుతో భారీ స్కెచ్ : వ్యాపారిని రూ. 3.3 కోట్లకు ముంచిన మహిళ
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- AI Pin
- Humane
- Launch
- SMARTPHONE
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

