న్యూఢిల్లీ : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బ్లూ టిక్‌ను లాంఛ్ చేయగానే మిశ్రమ స్పందనలు వెల్లడయ్యాయి. ఈ ఫీచర్‌పై కొందరు హ్యాపీగా ఫీలైతే మరికొందరు పెదవివిరిచారు. సెండర్లు మీకు పంపిన మెసేజ్‌లు మీరు చదివినట్టు వారికి తెలియడం మీకు ఇష్టం లేకపోతే వారికి మీరు ఆయా మెసేజ్‌లను చదివినట్టు తెలియకుండా మేనేజ్ చేసే వెసులుబాటు ఉంది.
బ్లూటిక్‌ను టర్న్ ఆఫ్ చేయకుండానే మీరు చదివినట్టు సెండర్‌కు తెలియకుండా చేయవచ్చు. ఈ టిప్స్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లూ ఉపయోగించుకోవచ్చు. ఈ టిప్స్‌తో మీరు సెండర్ పంపిన మెసేజ్‌లన్నీ మీరు చదివినట్టు వారికి తెలియకుండానే మొత్తం మెసేజ్‌లను రీడ్ చేయవచ్చు.
వాట్సాప్ మెసేజ్‌లను నోటిఫికేషన్ బార్ ద్వారా చదవడం
వాట్సాప్ పాపప్స్ ఫీచర్ ఉపయోగించడం
ఎయిర్‌ప్లేన్ మోడ్‌లోకి వెళ్లి మెసేజ్‌లు చదవడం
హోంస్క్రీన్‌లో విడ్జెట్ ద్వారా యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు చదవడం