CoWIN : కోవిన్ లో ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్.. డౌన్ లోడ్ చేసుకోండిలా
కోవిన్ లో ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్ | కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కు సంబంధించిన సమాచారం మొత్తం కోవిన్ అనే యాప్ ద్వారా తెలుసుకోవచ్చు
కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కు సంబంధించిన సమాచారం మొత్తం కోవిన్ అనే యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ బుకింగ్, వ్యాక్సిన్ సర్టిఫికెట్, వ్యాక్సినేషన్ సెంటర్లు.. ఇలా.. కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రతి సమాచారం అందులో ఉంటుంది.

తాజాగా.. ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్ ఆప్షన్ ను కూడా కోవిన్ యాప్ లో కేంద్రం యాడ్ చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇంటర్నేషనల్ వర్షన్ ను కోవిన్ యాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత డౌన్ లోడ్ చేసుకునే వ్యాక్సిన్ సర్టిఫికెట్ కేవలం డొమెస్టిక్ గా మాత్రమే పనిచేస్తుంది.
విదేశాలకు వెళ్లేవాళ్లు.. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్ ను తీసుకొని వెళ్లాల్సిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ట్రావెల్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ సర్టిఫికెట్ ను కేంద్ర తయారు చేసింది.

సెప్టెంబర్ 30 నుంచే ఈ సర్టిఫికెట్ ఆప్షన్ ను కోవిన్ యాప్ లో యాడ్ చేశారు. కోవిన్ పోర్టల్ కానీ.. యాప్ కానీ ఓపెన్ చేసి International Travel Certificate అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు.. కోవిన్ పోర్టల్ కు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే.. వ్యాక్సినేషన్ కోసం కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి.. ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈ సర్టిఫికెట్ లో వ్యాక్సినేషన్ వేయించుకున్న వ్యక్తి పుట్టిన తేదీ, డోసుల సంఖ్య, వ్యాక్సిన్ పేరు, టైప్, మానుఫాక్చరర్, నెంబర్, డోసులు తీసుకున్న తేదీ, డోస్ బ్యాచ్ నెంబర్.. అన్నీ ఉంటాయి. ఆ సర్టిఫికెట్ ఉంటేనే.. అంతర్జాతీయ ప్రయాణానికి అనుమతి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
WhatsApp : 20 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్.. కారణం ఇదే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

