Ola Electric Scooter Booking : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి? ముందు ఎంత క్యాష్ పే చేయాలి?

రోజూ రోడ్ల మీద తిరిగే వాహనాల వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతున్నదో అందరికీ తెలుసు. కానీ.. వాహనాలు వాడకుండా ఉండలేం. ప్రయాణం చేయకుంటే రోజు గడవదు. మరోవైపు పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటల్ వచ్చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల.. పర్యావరణానికి హాని ఉండదు. వందలకు వందలు పెట్టి పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. విదేశాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. మన దేశంలోనూ ఇదివరకు చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలయ్యాయి. టాటా కంపెనీ కూడా ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది కానీ.. అవి అంతగా వాహనదారులను ఆకట్టుకోలేకపోయాయి.

అయితే.. ఓలా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ బాగుండటంతో అందరూ ఇప్పుడు ఈ స్కూటర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆ కంపెనీ లాంచ్ చేసింది. ఓలాలో ఎస్1, ఎస్1 ప్రో అనే రెండు మోడల్స్ స్కూటర్లను లాంచ్ చేసింది.

ఈస్కూటర్ను కొనాలంటే ఏం చేయాలి? ఎప్పుడు డెలివరీ చేస్తారు? డెలివరీ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. వీటి చార్జింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు బుక్ చేసుకోవాలంటే ఎంత డబ్బు పే చేయాలి?.. ఇలా సవాలక్ష ప్రశలు వాహనదారుల మదిలో మెదులుతున్నాయి. వాటన్నింటికీ సమాధానమే ఈ కథనం.

499 రూపాయలకే ఓలా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు
కేవలం 499 రూపాయలకే ఓలా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఓలా ఎస్ 1 మోడల్ ధర రూ.99,999 నుంచి ప్రారంభం అవుతుండగా.. ఓలా ఎస్1 ప్రో.. ప్రారంభ ధర రూ.1,29,999 గా ఉంది. ముందు మాత్రం కేవలం 499 రూపాయలు కట్టి ఆన్ లైన్లో https://olaelectric.com/ వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. బైక్ డెలివరీ అయ్యాక.. మిగితా డబ్బులు కట్టాల్సి ఉంటుంది.

మొదటి ఫేజ్‌లో భాగంగా.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ 8 సెప్టెంబర్ 2021 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలోని 1000 నగరాల్లో అక్టోబర్‌లో ఓలా స్కూటర్‌ను డెలివరీ చేస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెంచడం కోసం కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై సబ్సిడీని అందిస్తున్నాయి. ఢిల్లీలో ఓలా ఎస్1 ధర సబ్సిడీ పోను.. రూ.85,099, ఎస్1 ప్రో ధర రూ.1,10,149 కే లభించనుంది. అలాగే.. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో కూడా అక్కడి ప్రభుత్వాలు సబ్సిడీని అందిస్తున్నాయి. మిగితా రాష్ట్రాల్లో కంపెనీ ప్రకటించిన ధరే ఉంటుంది.

అయితే.. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలుగా గుర్తించాలి. అలాగే.. ఈఎంఐ ద్వారా కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. కేవలం నెలకు రూ.2,999 చెల్లించి.. ఓలా ఎస్1 స్కూటర్‌ను కొనొచ్చు. చాలా బ్యాంకులతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ టైఅప్ అయింది. వాటి ద్వారా ఫైనాన్స్ తీసుకొని వెహికిల్ కొనుగోలు చేయొచ్చు. నెలనెలా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవచ్చు.

Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

