Oxygen : ఆక్సిజన్ ఎలా ఉత్పత్తి అయింది.. భూమ్మీదకు ఎక్కడి నుంచి వచ్చింది?
Oxygen : ఈ భూమ్మీద ఎన్నో మిస్టరీలు ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి. కొన్ని విషయాల విషయంలో ఎంత మేథోమధనం చేసినా వాటికి సమాధానం దొరకదు. అవి మిస్టరీగానే మిగిలిపోతాయి. అందులో ఒకటి ఆక్సిజన్. ఈ భూమ్మీద ఆక్సిజన్ లేకపోతే మనిషి బతకలేడు. మనిషే కాదు.. ఏ జీవి కూడా మనగడ సాధించలేదు. ఒక సెకన్ పాటు ఆక్సిజన్ లేకున్నా.. బతకలేం. జీవితాంతం ఆక్సిజన్ ను పీల్చుతూ బతకాల్సిందే. కరోనా మొదటి వేవ్ సమయం నుంచి ఆక్సిజన్ గురించి చాలా మంది తెలుసుకుంటున్నారు. ఆక్సిజన్ అందక దేశవ్యాప్తంగా చాలామంది కరోనా పేషెంట్లు చనిపోవడంతో.. అసలు.. ఆక్సిజన్ అంటే ఏంటి? ఆక్సిజన్ మనిషికి ఎంత అవసరం అనే విషయాలపై జోరుగా చర్చ సాగుతోంది.

అయితే.. ఒకప్పుడు ఈ భూమ్మీద చాలా తక్కువ ఆక్సిజన్ లేవల్స్ ఉండేవి. అప్పుడు ప్రాణకోటి లేదు. జీవరాశులు లేవు. కానీ.. నెమ్మదిగా జీవరాశులు పుట్టడం.. ప్రాణులు జన్మించడం.. మనుషులుగా రూపాంతరం చెందాక.. ఆక్సిజన్ కూడా ఎక్కువ శాతం భూమ్మీద ఉత్పత్తి అవడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి కావాల్సినంత ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అసలు.. ఆక్సిజన్ ఎలా ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి ఇంత ఆక్సిజన్ వచ్చింది.. అనేది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండేది. కానీ.. తాజాగా సైంటిస్టులు.. ఆక్సిజన్ ఉత్పత్తి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించారు.
నిరంతర సూర్యకాంతి వల్ల బ్యాక్టీరియా నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి
ఈ భూమ్మీద ఏ ప్రాణి లేని సమయం నుంచి సూర్యుడు ఉన్నాడు. అయితే సూర్యుడి నిరంతర కాంతి వల్ల.. భూమ్మీద ఉన్న బ్యాక్టీరియాలు, మైక్రోబీస్.. ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాయి. దీంతో ఆక్సిజన్ ఉత్పత్తి అనేది పెరిగింది.. అనేది తాజాగా పరిశోధనలో నిరూపించారు. దాని కోసం నార్త్ అమెరికాలో ఉన్న హురోన్ అనే సరస్సులో అడుగు భాగంలోకి వెళ్లి అక్కడ లోతులో రాళ్లకు పట్టుకొని ఉన్న వైట్, గ్రీన్ అండ్ పర్పుల్ మైక్రోబీస్ను ల్యాబ్‌లో పరీక్షించాక అసలు విషయం తెలిసింది. కాల క్రమేణ.. సూర్యకాంతి ఎక్కవవుతున్నా కొద్దీ.. ఈ మైక్రోబీలు.. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం మొదలు పెట్టాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ ఉత్పత్తి ఈ భూమ్మీద పెరిగిందో.. అప్పటి నుంచి జీవరాశి మనుగడ సాధ్యమైంది.

2.4 బిలియన్ సంవత్సరాల కింద ఈ భూమ్మీద కేవలం చాలా తక్కువ ఆక్సిజన్ ఉండేది. ఆ సమయంలో భూమ్మీద సంచరించిన మైక్రోబీలు, సియానో బ్యాక్టీరియా.. కార్బన్ డైయాక్సైడ్ ను పీల్చుకొని.. ఆక్సిజన్‌ను విడుదల చేయడం మొదలు పెట్టాయి.
రాను రాను.. భూమి పరిభ్రమించే వేగం కూడా తగ్గుతూ వచ్చింది. దాని వల్ల.. పగలు పెరిగింది. దీంతో సూర్యూడి కాంతి ఈ భూమ్మీద పడటం ఎక్కువైంది. అలా.. డేలైట్ పెరగడం.. దాని వల్ల.. మైక్రోబీలు ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం మొదలైంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

