G-mail in Offline | ఇక ఆఫ్‌లైన్‌లో జీ-మెయిల్ చెక్ చేసుకోవచ్చు.. ఇవీ డిటైల్స్!!
G-mail in Offline | ఇంటర్నెట్ లేకున్నా.. ఆఫ్‌లైన్‌లో జీమెయిల్ సేవలు చెక్ చేసుకునే వెసులుబాటు గూగుల్ తీసుకొచ్చింది.
G-mail in Offline | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్తో అనుబంధం కలిగి ఉన్నవారే. నెటిజన్లు.. ఐటీ, బిజినెస్ రంగాల్లో పని చేసేవారు తమ లావాదేవీలపై నిత్యం ఈ-మెయిల్స్‌లో సమాచార మార్పిడి చేస్తుంటారు. అందుకు ఇంట్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఒకవేళ బయటకు వెళితే.. అక్కడ ఇంటర్నెట్ ఉండకపోవచ్చు. అత్యవసరంగా ఈ-మెయిల్ ఓపెన్ చేయాల్సి రావచ్చు. ఒక్కోసారి ఈ-మెయిల్ చెక్ చేసుకుంటే బాగుండనని అనిపించవచ్చు. అటువంటి కష్టాలకు ఇక గూగుల్ చరమ గీతం పాడనున్నది. తన జీ-మెయిల్ యూజర్లకు ఆఫ్లైన్లోనూ సేవలను వినియోగంలోకి తీసుకొచ్చింది.
అంటే ఇక ఇంటర్నెట్ లేకుండానే ఆఫ్‌లైన్‌లోనే జీ-మెయిల్లో మెయిల్ చదివి సమాధానం ఇవ్వవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని మారుమూల ప్రాంతాల్లో జీ-మెయిల్ ఆఫ్‌లైన్ సేవలు వాడుకోవచ్చు. అయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోనే ఈ జీ-మెయిల్ ఆఫ్‌లైన్ సేవలు లభిస్తాయి. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఆఫ్ లైన్ సేవలు పొందలేరు. ఆఫ్‌లైన్‌లో జీ-మెయిల్ సేవలు ఎలా పొందాలో తెలుసుకుందామా..!
ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉన్నప్పుడు క్రోమ్ బ్రౌజర్లో mail.google.com బుక్‌మార్క్ చేసుకోవాలి. తర్వాత జీమెయిల్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సీ ఆల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆఫ్‌లైన్ ట్యాబ్ క్లిక్ చేయాలి. అప్పుడు ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ ఆప్షన్ సెలక్ట్ చేశాక ఆఫ్‌లైన్‌లో ఎన్ని రోజుల క్రితం ఈ-మెయిల్స్ స్టోర్ చేయాలో అడుగుతుంది. అందులో వారం, నెల, మూడు నెలల ఆప్షన్లుంటాయి. అందులో మీకు అవసరమైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అటుపై సేవ్ చేంజెస్పై క్లిక్ చేస్తే సరి. జీ-మెయిల్ ఆఫ్‌లైన్ సేవలు పొందొచ్చు. కొంత మంది జీమెయిల్ ఖాతాలో ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ ఆప్షన్ స్థానే ఎండ్ స్పేస్ అనే మెసేజ్ వస్తుంది. అటువంటి వారి జీ-మెయిల్ స్టోరేజీ కెపాసిటీ నిండిపోయిందని అర్థం. అప్పుడు గూగుల్ ఖాతాలో అనవసర డేటా తొలగిస్తే ఆఫ్‌లైన్‌లో మెయిల్స్ స్టోర్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఏఐటీయూసీ జాతీయ నాయకత్వంలో సింగరేణి నేతలకు కీలక బాధ్యతలు
Uday Singh Bayas | పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు అపూర్వ స్పందన : ఉదయ్ సింగ్ బయాస్
‘విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు’
Man Kills Mother, Sister | తల్లి, సోదరి మధ్య గొడవలతో కలత.. వారిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
గుబ్బలమంగి వాగు సమీపంలో యథేచ్ఛగా గోమాంస విక్రయాలు!
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

