Vikas Purohit | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మెటా.. ఇండియాలో గ్లోబల్ బిజినెస్ గ్రూప్ డైరెక్టర్‌గా వికాస్ పురోహిత్ నియమితులయ్యారు. దేశంలో లీడింగ్ అడ్వర్టైజర్స్, ఏజెన్సీ పార్టనర్స్‌పై వికాస్ పురోహిత్ దృష్టి సారిస్తారు. సంస్థ స్ట్రాటర్జీ డెలివరీ ఆఫ్ చార్టర్‌కు సారధ్యం వహిస్తారు. మెటా ఇండియా యాడ్స్ బిజినెస్ అధిపతి కం డైరెక్టర్ అరుణ్ శ్రీనివాస్‌కు పురోహిత్ రిపోర్ట్ చేస్తారు.
`భారత ఆర్థిక వృద్ధిరేటు బలోపేతానికి మద్దతు ఇవ్వడంతోపాటు మెటా ప్లాట్‌ఫామ్స్‌లో కీలక పాత్ర పోషించడానికి మా టీంలో చేరడానికి, భారత్‌లో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఏకోసిస్టమ్ నిర్మాణంకోసం వస్తున్న వికాస్ పురోహిత్‌కు స్వాగతం పలికడం థ్లిల్లింగ్‌గా భావిస్తున్నా` అని అరుణ్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
బెంగళూరు ఐఐఎం పూర్వ విద్యార్థిగా వికాస్ పురోహిత్‌కు మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, బిజినెస్, సేల్స్ రంగాల్లో 20 ఏండ్లకు పైగా అనుభవం ఉంది. టాటా క్లిక్, అమెజాన్, రిలయన్స్ బ్రాండ్స్, ఆదిత్యా బిర్లా గ్రూప్, టామీ హిల్ఫిగర్ ఐఎస్ తదితర సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. మెటాలో చేరడానికి ముందు 2022 డిసెంబర్లో టాటా క్లిక్ సీఈవోగా రాజీనామా చేశారు వికాస్ పురోహిత్. ఆదిత్యా బిర్లా గ్రూప్‌తో కెరీర్ ప్రారంభించారు.