Mobile Phone | మొదటి మొబైల్ కాల్‌కు 50 ఏండ్లు పూర్తి
Mobile Phone | ఒకపూట తినకపోయినా ఉంటా ఉండలేరు కొందరు. పసిబిడ్డలను లాలించాలన్నా, వయోవృద్ధుల కాలక్షేపానికైనా సెల్‌ఫోనే ఆధారం ఇప్పుడు. ఒకరకంగా చెప్పాలంటే మనుషుల జీవితాల్లో సెల్‌ఫోన్ భాగమైంది. కాళ్లు, చేతుల్లానే సెల్ కూడా ఒక అవయవంలా మారిపోయింది.
Mobile Phone | న్యూఢిల్లీ: ఒకపూట తినకపోయినా ఉంటా ఉండలేరు కొందరు. పసిబిడ్డలను లాలించాలన్నా, వయోవృద్ధుల కాలక్షేపానికైనా సెల్‌ఫోనే ఆధారం ఇప్పుడు. ఒకరకంగా చెప్పాలంటే మనుషుల జీవితాల్లో సెల్‌ఫోన్ భాగమైంది. కాళ్లు, చేతుల్లానే సెల్ కూడా ఒక అవయవంలా మారిపోయింది. ఇప్పుడు ఇంతలా వినియోగిస్తున్న సెల్‌ఫోన్ వయస్సు 50 ఏండ్లు నిండింది.
1973 ఏప్రిల్ 3న సెల్‌ఫోన్ నుంచి మొదటి ఫోన్ కాల్ చేశారు దాని సృష్టికర్త మార్టిన్ కూపర్. ఆయన అప్పట్లో మోటొరోలా సంస్థలో పని చేసేవారు. న్యూయార్క్‌లోని సిక్త్స్ అవెన్యూ 53వ, 54వ వీధుల మధ్య నడుస్తూ సెల్‌ఫోన్ నుంచి ఆయన మొదటి ఫోన్ కాల్ మాట్లాడారు. ఆ సమయంలో మోటొరోలాకు ప్రత్యర్థి సంస్థ అయిన బెల్ ల్యాబొరేటరీస్‌కు చెందిన ఇంజినీర్ జోయెల్ ఎంజెల్కు కూపర్ ఫోన్ చేయడం విశేషం. ‘జోయెల్.. నేను మార్టిన్. నేను సెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. చేతుల్లో పట్టుకోదగిన నిజమైన పోర్టబుల్ సెల్‌ఫోన్ ఇది’ అంటూ మార్టిన్ సంభాషణ సాగింది.
మొదటి సెల్‌ఫోన్ విశేషాలు
- మొదటి సెల్‌ఫోన్ పేరు డైనాటాక్(డైనమిక్ అడాప్టివ్ టోటల్ ఏరియా కవరేజ్)
- ఇది దాదాపుగా చెప్పుల డబ్బా అంత పెద్దగా ఉండేది. కిలో బరువు ఉండేది.
- 25 నిమిషాలు ఫోన్ మాట్లాడేందుకు 10 గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చేది.
- కనిపెట్టిన పదేండ్లకు డైనాటాక్ 8000ఎక్స్ పేరిట అమెరికాలో మోటొరోలా సంస్థ ఈ ఫోన్‌ను విక్రయాలు ప్రారంభించింది.
- 1983లో 3,995 డాలర్లకు మొదటిసారి దీనిని విక్రయించారు. మన కరెన్సీలో ప్రస్తుత విలువ ప్రకారం దీని ధర రూ.3.28 లక్షలు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

