లండన్ : టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ (Layoffs) ట్రెండ్ కొనసాగుతోంది. మనీ ట్రాన్స్ఫర్ బ్రాండ్స్ వరల్డ్‌రెమిట్, సెండ్వేవ్ల ప్రమోటర్ ఫిన్‌టెక్ యునికార్న్ జెప్జ్ 420 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 26 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. వేటుకు గురైన ఉద్యోగులకు సమాచారం చేరవేయడం కంపెనీ ప్రారంభించింది.
వెస్ట్రన్ యూనియన్‌కు ప్రత్యర్ధిగా పేరొందిన లండన్‌కు చెందిన మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రొవైడర్ జెప్జ్లో లేఆఫ్స్ ఫిన్‌టెక్ కంపెనీల్లో గుబులు రేపుతోంది. లేఆఫ్స్‌లో అధికంగా కస్టమర్ కేర్, ఇంజనీరింగ్ టీమ్‌లకు చెందిన ఉద్యోగులు ప్రభావితమవుతారని చెబుతున్నారు. ఉద్యోగుల సామర్ధ్యాలను మెరుగ్గా వాడుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యను కుదించినట్టు కంపెనీ పేర్కొంది.
లేఆఫ్స్ బాధితులకు కౌన్సెలింగ్, కోచింగ్, కెరీర్ గైడెన్స్ రూపంలో సాయం చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. జెప్జ్ను ఒక డైనమిక్ సంస్థగా మార్చడానికి దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జెప్జ్ సీఈవో మార్క్ లెన్హార్డ్ లేఆఫ్స్ గురించి మాట్లాడుతూ పేర్కొన్నారు.
Read More