ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ..
ISRO | మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 23న
బెంగళూరు: మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 23న బాహుబలి రాకెట్ జీఎస్ఎల్వీ-మార్క్ 3 (ఎల్వీ-ఎం3)ను ప్రయోగించనున్నది. దీనికి సంభందించిన కౌంట్‌డౌన్ శుక్రవారం అర్ధరాత్రి 12.07 గంటలకు ప్రారంభమైంది. అన్నీ సజావుగా జరిగతే శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ వన్‌వెబ్‌కి చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా రోదసిలోకి పంపనున్నది.

5,200 కిలోల బరువు కలిగిన ఈ 36 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది. రాకెట్ భూమి నుంచి ఎగిరిన అనంతరం 16.21 నిమిషాల్లో 36 ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడుతుంది. ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన అనంతరం యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

