CMF Phone 2 Pro | నథింగ్ నుంచి సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రొ వచ్చేసింది.. ఫీచర్లు అదిరిపోయాయ్..!
మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను ఆకట్టుకునే ఫీచర్లతో తయారు చేసి అందించడంలో పేరు గాంచిన నథింగ్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ తయారు చేస్తున్న ఫోన్లు వినియోగదారులలో మంచి ఆదరణను దక్కించుకుంటున్నాయి.
CMF Phone 2 Pro | మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను ఆకట్టుకునే ఫీచర్లతో తయారు చేసి అందించడంలో పేరు గాంచిన నథింగ్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ తయారు చేస్తున్న ఫోన్లు వినియోగదారులలో మంచి ఆదరణను దక్కించుకుంటున్నాయి. అందులో భాగంగానే నథింగ్ సంస్థ సీఎంఎఫ్ పేరిట మరో నూతన బ్రాండ్‌ను ఆవిష్కరించి ఆ బ్రాండ్ పేరిట స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఇక లేటెస్ట్గా సీఎంఎఫ్ బ్రాండ్ ఆధ్వర్యంలో మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రొ పేరిట ఈ ఫోన్‌ను లేటెస్ట్గా భారత్‌లో లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.77 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేయగా, దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ లభిస్తోంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను సైతం అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. సూర్య కాంతిలో సైతం 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను ఈ ఫోన్ అందిస్తుంది.
ప్రత్యేక కూలింగ్ సిస్టమ్..
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. సీఎంఎఫ్ ఫోన్ 1 కన్నా ఈ ఫోన్ 10 శాతం వేగంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 8 జీబీ ర్యామ్‌ను అందిస్తుండగా మరో 8 జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్ అంత సులభంగా హీట్‌కు గురి కాదు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే నథింగ్ ఓఎస్ 3.2 ఇందులో లభిస్తుంది. ఈ ఫోన్‌కు గాను 3 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్లో ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు.
భారీ బ్యాటరీ, అద్భుతమైన కెమెరాలు..
ఇందులో వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. మరో 8 మెగాపికల్స్ అల్ట్రా వైడ్ కెమెరాను ఇచ్చారు. 50 మెగాపిక్సల్ 2ఎక్స్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. అందువల్ల 20ఎక్స్ వరకు డిజిటల్ జూమ్‌ను పొందవచ్చు. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ వైట్, బ్లాక్, ఆరెంజ్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇందులో అందిస్తున్నారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. 20 నిమిషాల్లోనే ఫోన్‌ను 0 నుంచి 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు. ఫోన్‌తోపాటు చార్జర్, ఫోన్ కేస్‌ను అందిస్తున్నారు. 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ మోడల్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయగా, ఇందులో మెమొరీ కార్డును వేసుకోవచ్చు. 2 టీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. కానీ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ మోడల్‌గా మాత్రమే వాడుకోవచ్చు.
ధర వివరాలు..
ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందిస్తుండగా యూఎస్బీ టైప్ సిని ఉపయోగించుకోవచ్చు. ఐపీ 54 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్ లభిస్తుంది. 5జిని ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.3 వంటి ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రొ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999 ఉంగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ తోపాటు అన్ని ప్రధాన రిటెయిల్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను మే 5వ తేదీ నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డులతో రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ.1000 వరకు అదనంగా బోనస్ ఇస్తారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

