Chandrayaan-3 | చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు.. సల్ఫర్ నిక్షేపాలు కూడా.. ఇస్రో కీలక ప్రకటన
Chandrayaan-3 | చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రజ్ఞాస్ రోవర్ పలు కీలక సమాచారాన్ని సేకరించింది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించింది. అలాగే చంద్రుడిపై సల్ఫర్ నిక్షేపాలు కూడా భారీగానే ఉన్నాయని తొలిసారిగా కనుగొన్నది.
Chandrayaan-3 | చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ పలు కీలక సమాచారాన్ని సేకరించింది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించింది. అలాగే చంద్రుడిపై సల్ఫర్ నిక్షేపాలు కూడా భారీగానే ఉన్నాయని తొలిసారిగా కనుగొన్నది. ఆక్సిజన్, సల్ఫర్ మాత్రమే కాకుండా పలు ఖనిజాలు ఉన్నట్లుగా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
చంద్రుడి ఉపరితలంలో అల్యూమినియం ( Al ), కాల్షియం (Ca), ఐరన్(Fe), క్రోమియం ( Cr), టైటానియం (Ti), మాంగనీస్ (Mn), సిలికాన్ (Si), ఆక్సిజన్ (O) ఉన్నాయని ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. జాబిల్లిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు, అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకు లిబ్స్ ( లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్) అనే పరికరాన్ని ప్రజ్ఞాన్ రోవర్‌కు ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. ఆ పరికరమే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఖనిజాలను గుర్తించింది. హైడ్రోజన్ ఆనవాళ్ల కోసం కూడా ఆన్వేషణ కొనసాగుతుందని ఇస్రో తెలిపింది. ప్రజ్ఞాస్ రోవర్లో అమర్చిన లిబ్స్ పరికరాన్ని బెంగళూరుకు చెందిన ల్యాబరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ డెవలప్ చేసిందని పేర్కొంది.
Chandrayaan-3 Mission:
In-situ scientific experiments continue …..
Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL
— ISRO (@isro) August 29, 2023
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

