I-Phone | ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్ వరకు పలు రకాల ఆప్షన్లు, ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు ప్రతి ఒక్కరూ ప్రియారిటీ ఇస్తుంటారు. ఎక్కువ రిజొల్యూషన్ గల కెమెరాలు, మెరుగైన ఆపరేటింగ్ సిస్టమ్స్, సెక్యూరిటీ వంటి పలు అంశాలపై చెక్ చేసుకున్నాకే ఆన్లైన్లో ఆర్డర్ చేయడమో.. ఆఫ్‌లైన్‌లో షాప్‌కెళ్లి కొనుక్కోవడమో చేస్తుంటారు. అదే ఆపిల్ ఐ-ఫోన్ తక్కువ ధరకు లభిస్తుందంటే ఎవరు కాదంటారు.. యస్ ఇది నిజం.. ఆపిల్ ఐఫోన్ రూ.23 వేల లోపే వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. మీరు ఆపిల్ ఐ-ఫోన్ కొనుక్కోవాలని ఆశిస్తున్నారా.. ఇంకెందుకు ఆలస్యం.. ఆర్డర్ బుక్ చేసుకోవడానికి ఇదే సరైన టైం. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్ అందిస్తోంది.
ఐ-ఫోన్ 11 మోడల్ స్మార్ట్ ఫోన్ మీద భారీగా ధర తగ్గిస్తున్నాయి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు. 128 జీబీ కెపాసిటీ గల ఐఫోన్ ధర రూ.43,900. ఆరు శాతం డిస్కౌంట్‌పై రూ.40,990లకు లభిస్తుంది. దీనికి తోడు భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.17,500 డిస్కౌంట్ కల్పిస్తున్నది. ఎక్స్చేంజ్ ఆఫర్‌తో ఐఫోన్-11 ఫోన్ ధర రూ.23,490కే పొందొచ్చు. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు కింద ఐదు శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ ప్రైస్ కింద రూ.2,910 వరకు రాయితీ పొందొచ్చు. కస్టమర్లకు ఈజీ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నెలకు రూ.3,681 నుంచి ఈఎంఐ పెట్టుకోవచ్చు.
2019 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి ఎంటరైన ఐఫోన్-11 సిరీస్ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరాతో వచ్చింది. గత మార్చి నాటికి 159.2 మిలియన్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా హెచ్డీ డిస్ప్లేతో వచ్చింది. రెండు 12 ఎంపీ కెమెరాలు, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ వైట్, బ్లాక్, గ్రీన్, రెడ్, పర్పుల్, ఎల్లో కలర్ ఆప్షన్లలో వస్తున్నది. ఐ-పోన్-11 సిరీస్ ఫోన్ ఏ13 బయోనిక్ చిప్సెట్, 4జీబీ రామ్‌తో వస్తున్నది. ఐపీ 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌తో లభ్యం అవుతుంది.